కేసీఆర్ కు శుభాకాంక్షలు తెలిపిన సీఎం రేవంత్ రెడ్డి

కేసీఆర్ కు శుభాకాంక్షలు తెలిపిన సీఎం రేవంత్ రెడ్డి

హైదరాబాద్‌: కేసీఆర్ కు శుభాకాంక్షలు తెలిపిన సీఎం రేవంత్ రెడ్డి.నేడు బీఆర్‌ఎస్‌ అధినేత, తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్‌ పుట్టినరోజు. ఈ సందర్భంగా ఆయనకు సీఎం రేవంత్ రెడ్డి సందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు. “గజ్వేల్ నియోజకవర్గ శాసనసభ్యులు, మాజీ ముఖ్యమంత్రి శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖర రావు గారి జన్మదినం సందర్భంగా ముఖ్యమంత్రి శ్రీ ఎ.రేవంత్ రెడ్డి గారు వారికి హార్దిక శుభాకాంక్షలు తెలియజేశారు. నిత్యం ప్రజాసేవలో నిమగ్నమవుతూ రాష్ట్రాభివృద్ధికి పాటుపడటంలో భగవంతుడు వారికి సంపూర్ణ ఆయురారోగ్యాలు ప్రసాదించాలని” ఆకాంక్షించారు. ఈ మేరకు రేవంత్‌ రెడ్డి ‘ఎక్స్’ వేదికగా ట్వీట్ చేశారు.రాష్ట్రాభివృద్ధికి పాటుపడటంలో భగవంతుడు వారికి సంపూర్ణ ఆయురారోగ్యాలు ప్రసాదించాలి.

కేసీఆర్  శుభాకాంక్షలు తెలిపిన సీఎం

కేసీఆర్‌ బర్త్‌డే వేడుకల నిర్వహణకు భారీ ఏర్పాట్లు

మరోవైపు కేసీఆర్‌ జన్మదిన వేడుకలను సోమవారం అత్యంత ఘనంగా, పండుగ వాతావరణంలో నిర్వహించనున్నట్టు మాజీ మంత్రి, సనత్‌నగర్‌ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్‌యాదవ్‌ చెప్పారు. ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈసారి కూడా తన ఆధ్వర్యంలో కేసీఆర్‌ బర్త్‌డే వేడుకల నిర్వహణకు భారీ ఏర్పాట్లు చేస్తున్నట్టు చెప్పారు. ఈ వేడుకలకు పార్టీ వరింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌, మాజీ మంత్రి హరీశ్‌రావు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత, ఎంపీలు, మాజీ మంత్రులు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, మాజీ ఎంపీలు, కార్పొరేటర్లు, కార్పొరేషన్ల మాజీ చైర్మన్ల, పార్టీ నాయకులు, అభిమానులు, ఉద్యమకారులు పెద్ద సంఖ్యలో హాజరవుతారని తెలిపారు.

కేసీఆర్‌ జీవిత, రాజకీయ ప్రస్థానంతో కూడిన ప్రత్యేక డాక్యుమెంటరీ

ఆదివారం ఆయన హైదరాబాద్‌లోని పార్టీ కేంద్ర కార్యాలయం తెలంగాణభవన్‌లో పుట్టినరోజు వేడుకల ఏర్పాట్లను మాజీ మంత్రి మహమూద్‌ అలీ, తెలంగాణభవన్‌ ఇన్‌చార్జి రావుల చంద్రశేఖర్‌రెడ్డి తదితరులతో కలిసి పరిశీలించారు. అనంతరం మీడియాతో తలసాని మాట్లాడుతూ.. ఉదయం 10 గంటలకు కేసీఆర్‌ జన్మదిన వేడుకలు ప్రారంభం అవుతాయని చెప్పారు. తొలుత డప్పు కళాకారులు, గిరిజన వేషధారణలో నృత్యాల ప్రదర్శన, కళాకారులతో సాంస్కృతిక కార్యక్రమాల నిర్వహణ ఉంటుందని తెలిపారు. అనంతరం కేసీఆర్‌ జీవిత, రాజకీయ ప్రస్థానంతో కూడిన ప్రత్యేక డాక్యుమెంటరీని ప్రదర్శించనున్నట్టు పేర్కొన్నారు. ఆ తర్వాత కేసీఆర్‌ 71వ పుట్టినరోజు సందర్భంగా 71 కిలోల భారీ కేక్‌ను కట్‌చేయనున్నట్టు చెప్పారు.

Related Posts
పోసానికి 14 రోజుల రిమాండ్ జైలు కు తరలింపు.
పోసానికి 14 రోజుల రిమాండ్ జైలు కు తరలింపు.

సినీ నటుడు, రచయిత పోసాని కృష్ణమురళిని అన్నమయ్య జిల్లా ఓబులవారిపల్లె పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. జనసేన రాయలసీమ జోన్ కన్వీనర్ జోగిమణి ఫిర్యాదు మేరకు Read more

తెలంగాణ మందుబాబులకు షాకింగ్ వార్త..?
liquor sales in telangana jpg

తెలంగాణ మందుబాబుల జేబులకు చిల్లు పడే వార్త. త్వరలో మద్యం ధరలు భారీగా పెంచేందుకు సర్కార్ సిద్ధం అవుతున్నట్లు తెలుస్తుంది. పక్క రాష్ట్రాల్లో ఉన్న రేట్లకు అనుగుణంగా Read more

సంక్రాంతి సంబరాల్లో పాల్గొననున్న మోదీ
సంక్రాంతి సంబరాల్లో పాల్గొననున్న మోదీ

కేంద్ర మంత్రి నివాసంలో జరిగే వేడుకలకు తెలుగు మాట్లాడే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు చెందిన సీనియర్ బిజెపి నాయకులు, పార్లమెంటు సభ్యులు కూడా హాజరయ్యే అవకాశం ఉంది. Read more

పీసీసీ చీఫ్‌ను కలిసిన ఎమ్మెల్సీ అభ్యర్థులు
MLC candidates meet PCC chief

హైదరాబాద్‌: ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో బరిలో ఉన్న కాంగ్రెస్ అభ్యర్థులు మంగళవారం పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్‌ను కలిశారు. కాంగ్రెస్ అభ్యర్థులు విజయశాంతి, అద్దంకి Read more