CM Revanth Reddy : సీఎం రేవంత్ రెడ్డి రవీంద్రభారతిలో కొలువుల పండుగ కార్యక్రమంలో మాట్లాడుతూ కేటీఆర్‌పై కీలక వ్యాఖ్యలు చేశారు. కేటీఆర్ నాకు, నీకు పోలికే లేదు అని అన్నారు. కారుణ్య నియామకాల కింద ఎంపికైన 922 మంది అభ్యర్థులకు ఉద్యోగాలు కల్పించామని తెలిపారు. 70 సార్లు మిస్ వరల్డ్ పోటీలు ఇతర దేశాల్లో జరిగాయి. మిస్ వరల్డ్ పోటీలు ఇక్కడ ఎందుకు అని కేటీఆర్ అడుగుతున్నారు. ఫార్ములా ఈ కేసులో ప్రభుత్వ నిధులు కొల్లగొట్టావు.. కేటీఆర్ నీకు నాకు పోలిక ఏంటి..? అన్నారు.

18 గంటలు పని చేసే నాకు పట్టులేదట
ఎంత పెద్దోడు అయినా బిల్డ్ నౌ పోర్టల్ లో దరఖాస్తు చేసుకోవాల్సందే. కొందరూ మార్కెటింగ్ చేస్తున్నారు. మా లాంటి వాళ్లు కష్టపడుతున్నారు. ఉద్యోగాలు ఇచ్చినందుకు నాపై కోపం ఉందా..? సోషల్ మీడియా పెట్టుబడిదారులది అన్నారు. 18 గంటలు పని చేసే నాకు పట్టులేదట. మేము ధర్నా చేయనియకపోతే పట్టు ఉన్నట్టా..? అని ప్రశ్నించారు. మనుషుల్లో ఉన్న క్రూర మృగాలను నల్లమల్లలో పెరిగిన నాకు గుర్తుపట్టరాదా..? అన్నారు.
11 శాతం ఇంట్రెస్ట్ తో అప్పులు తెచ్చిండు కేసీఆర్
పట్టింపు లేని నీ విధానం.. పట్టుదలతో పని చేయడం మా విధానం.. కేసీఆర్ చేసిన అప్పులు.. చేసిన తప్పులకు లక్ష 53 వేల కోట్లు కట్టిన అని సీఎం రేవంత్ తెలిపారు. లక్ష 53 వేల కోట్లు నా దగ్గర ఉంటే క్షణం లో 2 లక్షల రుణాలు మాఫీ చేసే వాణ్ణి.. ఓ వ్యక్తి చేసిన అప్పులకు మనం తిప్పలు పడుతున్నాం. రిటైర్మెంట్ బెనిఫిట్ లు 8000 కోట్లు పెండింగ్ పెట్టారు. 11 శాతం ఇంట్రెస్ట్ తో అప్పులు తెచ్చిండు కేసీఆర్. 4 శాతం ఇంట్రెస్ట్ కి అప్పు ఇవ్వడానికి చాలా బ్యాంకులు సిద్ధంగా ఉన్నాయి.