CM Revanth Reddy challenged KCR

కేసీఆర్‌కి సవాల్ విసిరిన సీఎం రేవంత్ రెడ్డి

సర్వే ఏ గ్రామంలో, ఏ వార్డులో తప్పు ఉందో చూపించాలి

హైదరాబాద్‌: ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి నిజామాబాద్‌లో ఎమ్మెల్సీ గ్రాడ్యుయేట్స్ ఎన్నికల ప్రచార సభలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ..కేసీఆర్ గతంలో 12 గంటల్లో సర్వే చేసి ఇప్పుడు తమ కులగణన లెక్కలు తప్పు అంటున్నారని సీఎం రేవంత్ రెడ్డి ఫైర్ అయ్యారు. కులగణన సర్వే ఏ గ్రామంలో, ఏ వార్డులో తప్పు ఉందో చూపించాలని కేసీఆర్ కి సవాల్ విసిరారు. కేసీఆర్ సర్వేలో 51 శాతం బీసీలు ఉంటే.. మా సర్వేలో 56 శాతం ఉన్నారు.

కేసీఆర్‌కి సవాల్ విసిరిన సీఎం

మరీ బీసీ కాకుండా ఏ కేటగిరి కింద ఉంటారు

ముస్లింలను బీసీలలో చేర్చారని బండి సంజయ్ అంటున్నారు. దూదేకుల సహా 28 జాతులను ఎప్పటి నుంచో బీసీ రిజర్వేషన్లు ఉన్నాయని పేర్కొన్నారు. మరీ బీసీ కాకుండా ఏ కేటగిరి కింద ఉంటారని ప్రశ్నించారు. తమ ప్రభుత్వ హయాంలో రైతు భరోసా, రైతు రుణమాఫీ, మహిళలకు ఉచిత బస్సు, నిరుద్యోగులకు 50వేల ఉద్యోగాలు ఇచ్చామని గుర్తు చేశారు. కేసీఆర్ పదేళ్లలో ఇవ్వని ఉద్యోగాలను మేము సంవత్సర కాలంలోనే ఇచ్చినట్టు తెలిపారు.

ఫామ్ హౌస్ లో కూర్చొని ప్రభుత్వం పై కుట్రలు

రాష్ట్రం కోసం పోరాడిన గ్రాడ్యుయేట్స్ కోసం కేసీఆర్ ఏం చేశారని ప్రశ్నించారు. కేసీఆర్ అవసరం రాష్ట్రానికి లేదని ప్రజలు తీర్పు ఇచ్చారు. రాష్ట్రంతో పేగుబంధం తెంచుకొని పార్టీ పేరు కూడా మార్చుకున్నారు. చేసింది చాలు.. ఇక ఫామ్ హౌస్ లో రెస్ట్ తీసుకోవాలని ప్రజలు ఆయనకు చెప్పారు. ప్రజలు తిరస్కరించినా కేసీఆర్ లో మార్పు రాలేదు. ఫామ్ హౌస్ లో కూర్చొని ప్రభుత్వం పై కుట్రలు చేస్తున్నారని రేవంత్ రెడ్డి ఆరోపించారు.

Related Posts
మోనాలిసా ను కలవబోతున్న డైరెక్టర్.
మోనాలిసా ను కలవబోతున్న డైరెక్టర్

గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో ఓ అమ్మాయి ఫోటోలు, వీడియోలు చక్కర్లు కొడుతున్నాయి. కాటుక పెట్టిన తేనె కళ్లు, డస్కీ స్కీన్, అందమైన చిరునవ్వు—ఇలాంటి లుక్‌తో Read more

70 గంటల వర్క్ వీక్: మరోసారి నారాయణ మూర్తి సంచలన వ్యాఖ్యలు
murthy

ఇన్ఫోసిస్ వ్యవస్థాపకుడు నారాయణ మూర్తి, పలు సార్లు వివాదాలకు గురైన వ్యాఖ్యలు చేయడంతో మరోసారి ఇంటర్నెట్‌లో సంచలనాన్ని సృష్టించారు.. ముంబైలో నవంబర్ 14, 2024 న జరిగిన Read more

పెద్దిరెడ్డిపై విచారణకు జాయింట్ కమిటీ
peddireddy

ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిపై అటవీ భూముల ఆక్రమణ ఆరోపణలు తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. ఈ నేపథ్యంలో ఆ ఆరోపణలపై పూర్తిస్థాయి విచారణ జరిపించేందుకు ప్రభుత్వం Read more

నేడు ఏపీ కేబినెట్ భేటీ
AP Cabinet meeting today

అమరావతి: సీఎం చంద్రబాబు అధ్యక్షతన నేడు ఏపీ కేబినెట్ భేటీ కానుంది. గురువారం ఉదయం 11 గంటలకు ఏపీ మంత్రివర్గం సమావేశమై పలు కీలక అంశాలపై చర్చించనుంది. Read more