revanth reddy

స్థానిక సంస్థల ఎన్నికలపై సీఎం రేవంత్ ఫోకస్

తెలంగాణ రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పైన సీఎం రేవంత్ ఫోకస్ చేసారు. ఫిబ్రవరి 1 నాటికి సర్పంచ్ ల పదవీ కాలం ముగిసిన ఏడాది పూర్తవుతుంది. పంచాయతీల్లో ఏడాదిగా ప్రత్యేకాధికారుల పాలన కొనసాగుతోంది. దీంతో, ఫిబ్రవరిలో స్థానిక ఎన్నికల నిర్వహణ పైన రేవంత్ కసరత్తు చేస్తున్నారు. బీసీ రిజర్వేషన్ల అంశం కీలకంగా మారుతోంది. దీంతో, ఈ రోజు ఎన్నికల పైన కీలక నిర్ణయం వెలువడే అవకాశం ఉంది. రేవంత్ సమావేశం తెలంగాణలో స్థానిక ఎన్నికల సమరం మొదలవుతోంది. అయితే, ముహూర్తం పైన ఈ రోజు స్పష్ట త వచ్చే అవకాశం కనిపిస్తోంది. ముఖ్యమంత్రి రేవంత్ మంత్రులు, అధికారులతో కీలక సమావేశం నిర్వహిస్తున్నారు. స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్ల పెంపుపై ప్రభుత్వం తర్జన భర్జన పడుతోంది. దీంతో, బీసీ డెడికేషన్ కమిషన్ నివేదిక కోసం ప్రభుత్వం ఎదురుచూస్తోంది. ఇప్పటికే కమిషన్ నివేదికను సిద్ధం చేసింది. ఈ రోజు సమావేశంలో ఈ నివేదిక ప్రభుత్వానికి సమర్పించే అవకాశం కనిపిస్తోంది. మంత్రులు, అధికారులతో చర్చించిన తరువాత రిజర్వేషన్ల పైన తుది నిర్ణయం తీసుకోనున్నారు. ఆ తరువాతనే ఎన్నికల షెడ్యూల్ విడుదల కానున్నట్లు సమాచారం.

Advertisements

మార్చి 21 నుంచి పదో తరగతి పరీక్షలు ప్రారంభమై ఏప్రిలో 4 వరకు కొనసాగుతాయి. ఆ తర్వాత ఏప్రిల్‌లో ఇంటర్‌, డిగ్రీ పరీక్షలు, మే నెలలో వివిధ ప్రవేశ పరీక్షలు ఉన్నాయి. ఆ తరువాత వేసవిలో వచ్చే సహజమైన సమస్యలు ఎన్నికల నిర్వహణ.. ఫలితాల పైన ప్రభావం చూపే అవకాశం ఉంది. నీటి ఎద్దడి, విద్యుత్ కోతలు వంటివి ప్రతిపక్షాలకు అవకాశం మారే ఛాన్స్ ఉంటుందనే అంచనాలు ఉన్నాయి.ఎన్నికల సమరం దీంతో, ఫిబ్రవరిలోనే ఎన్నికలకు వెళ్తారా.. లేక జూన్ తరువాత నిర్వహిస్తారా అనేది ఈ భేటీలో స్పష్టత వచ్చే ఛాన్స్ ఉంది.

Related Posts
బెటాలియన్‌ కానిస్టేబుళ్లపై వేసిన సస్పెన్షన్‌ను ఎత్తివేయాలి – హరీష్ రావు డిమాండ్
Harish Rao stakes in Anand

బెటాలియన్‌ కానిస్టేబుళ్లపై వేసిన సస్పెన్షన్‌ను ఎత్తివేయాలని సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు కోరారు. టాలియన్ కానిస్టేబుళ్లపై సస్పెన్షన్ విధించడం, ఆకస్మికంగా నిబంధనలు సవరించడం వారికి అన్యాయం చేస్తుందని Read more

పోసాని బెయిల్ పిటిషన్ వాయిదా
పోసాని బెయిల్ పిటిషన్ వాయిదా

సినీ పరిశ్రమలో పాపులర్ అయిన నటుడు పోసాని కృష్ణమురళి ప్రస్తుతం రాజంపేట సబ్ జైల్లో ఉన్నారు. ఆయనపై ఉన్న వివిధ కేసుల్లో, ఆయన బెయిల్ పిటిషన్‌పై రైల్వే Read more

ఇంకా మారకపోతే మార్చురీకి పోతారు: కవిత
kavitha comments on cm revanth reddy

హైరదాబాద్‌: బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మరోసారి ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డిపై విమర్శలు గుప్పించారు. తన తండ్రి కేసీఆర్ ను ఉద్దేశించి రేవంత్ రెడ్డి అనుచిత వ్యాఖ్యలు Read more

రేపు సెలవు ప్రకటించిన తెలంగాణ సర్కార్
Sant Sevalal Maharaj Jayant

సేవాలాల్ మహారాజ్ జయంతి తెలంగాణ ప్రభుత్వం గిరిజనుల ఆరాధ్య దైవం సేవాలాల్ మహారాజ్ జయంతి సందర్భంగా ఫిబ్రవరి 15న ప్రత్యేక సెలవు ప్రకటించింది. గిరిజన ఉద్యోగులకు ఈరోజు Read more