CM Rekha Gupta met the President and Vice President

రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతిని కలిసిన సీఎం రేఖా గుప్తా

ముందుగా రాష్ట్రపతి భవన్‌కు వెళ్లిన సీఎం రేఖా గుప్తా

న్యూఢిల్లీ: బీజేపీ నాయకురాలు రేఖా గుప్తా ఢిల్లీ నూతన ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ఇవాళ మధ్యాహ్నం ఆమె రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము, ఉప రాష్ట్రపతి జగదీప్‌ ధన్‌ఖర్‌ ను కలిశారు. ముందుగా రాష్ట్రపతి భవన్‌కు వెళ్లిన సీఎం రేఖా గుప్తా.. అక్కడ ద్రౌపదీ ముర్మును మర్యాదపూర్వంగా కలిశారు. అనంతరం వైస్‌ ప్రెసిడెంట్‌ ఎన్‌క్లేవ్‌లో ఉపరాష్ట్రపతి ధన్‌ఖర్‌ను కలిశారు. ఈ సందర్భంగా ఇద్దరితోనూ సీఎం ముచ్చటించారు. ఇందుకు సంబంధించిన ఫొటోలను రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి కార్యాలయాలు ఎక్స్‌ వేదికగా పోస్టు చేశాయి.

ఆయుష్మాన్‌ భారత్‌ పథకాన్ని అమలు

కాగా, ఢిల్లీ నూతన ముఖ్యమంత్రిగా రేఖా గుప్తా గురువారం మధ్యాహ్నం ప్రమాణస్వీకారం చేసిన విషయం తెలిసిందే. రామ్‌లీలా మైదానంలో అట్టహాసంగా జరిగిన ఈ కార్యక్రమంలో లెఫ్ట్‌నెంట్‌ గవర్నర్‌ వీకే సక్సేనా ఆమెతో ప్రమాణం చేయించారు. మంత్రులుగా పర్వేశ్‌ వర్మ, కపిల్‌ మిశ్రా, మన్‌జీందర్‌ సింగ్‌ సిర్సా, ఆశిష్‌ సూద్‌, రవిందర్‌ ఇంద్రాజ్‌ సింగ్‌, పంకజ్‌ సింగ్‌ సైతం ప్రమాణస్వీకారం చేశారు. అనంతరం సచివాలయంలో రేఖా గుప్తా సీఎంగా బాధ్యతలు స్వీకరించారు. సాయంత్రం మొదటి మంత్రివర్గ సమావేశం జరిగింది. ఆయుష్మాన్‌ భారత్‌ పథకాన్ని అమలు చేయాలని, పెండింగ్‌లో ఉన్న 14 కాగ్‌ రిపోర్టులను అసెంబ్లీలో ప్రవేశపెట్టాలని ఇందులో నిర్ణయం తీసుకున్నారు. కాగా, కొత్త మంత్రులకు శాఖల కేటాయింపు పూర్తయ్యింది. ఆర్థిక, రెవెన్యూ శాఖలను సీఎం రేఖా గుప్తా తన వద్ద ఉంచుకున్నారు.

Related Posts
సీఎం రేవంత్ ఎమోష‌న‌ల్
cm revanth

మూసీ పునరుజ్జీవంపై సీఎం రేవంత్ ఎమోషనల్ అయ్యారు. హైద‌రాబాద్ కు మూసీ వ‌రం కావాలి కానీ శాపం కావ‌ద్దొని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. న‌దుల వెంట Read more

తెలంగాణ విద్యుత్ శాఖలో కొలువుల జాతర
new jobs notification in Te

తెలంగాణలో విద్యుత్ శాఖలో త్వరలోనే పెద్ద సంఖ్యలో ఖాళీ పోస్టులను భర్తీ చేసేందుకు డిస్కంలు సిద్ధమవుతున్నాయి. విద్యుత్ శాఖలో మొత్తం 3,260 పోస్టులను భర్తీ చేయాలని అధికారులు Read more

మార్చి 8న కొత్త మహిళా పథకాల ప్రారంభానికి కేంద్రం కసరత్తు
మార్చి 8న కొత్త మహిళా పథకాల ప్రారంభానికి కేంద్రం కసరత్తు

అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా కేంద్రం, బీజేపీ పాలిత రాష్ట్రాలు నూతన మహిళా సాధికారత పథకాలను ప్రారంభించేందుకు సన్నద్ధం.ఆర్థిక, విద్య, సామాజిక అభివృద్ధి లక్ష్యంగా పలు కార్యక్రమాల Read more

4 గ్రహాలను గుర్తించే అరుదైన అవకాశం!
4 గ్రహాలను గుర్తించే అరుదైన అవకాశం!

ప్లానెటరీ సొసైటీ ఆఫ్ ఇండియా (పిఎస్ఐ) వ్యవస్థాపక అధ్యక్షుడు ఎన్. శ్రీ రఘునాథన్ కుమార్ సలహా ఇస్తూ, "6 నుండి 7 గ్రహాల దృశ్యమానత గురించి కొన్ని Read more