ఆంధ్రప్రదేశ్‌లో రూ.47,776 కోట్ల పెట్టుబడులకు గ్రీన్ సిగ్నల్!

రేపు ఢిల్లీకి సీఎం చంద్రబాబు

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రేపు (శనివారం) ఢిల్లీ కి వెళ్లనున్నారు. ఫిబ్రవరి 5న ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఆయన ప్రచారం చేయనున్నారు. ఎన్డీయే పొత్తులో భాగంగా బీజేపీ తరఫున ప్రచారం చేయాలని టీడీపీ నిర్ణయించింది. ఈ మేరకు ఢిల్లీకి చంద్రబాబు రేపు వెళ్లనున్నారు. బీజేపీకి మద్దతుగా తెలుగువారున్న ప్రాంతాల్లో ఆయన ప్రచారం చేయనున్నారు. దీనికి సంబంధించి నేడు ఢిల్లీలో ఆంధ్ర అసోసియేషన్‌తో టీడీపీ ఎంపీలు సమావేశం కానున్నారు. ఆదివారం రోజు ఎంపీలతో కలిసి బీజేపీ తరఫున చంద్రబాబు ప్రచారం చేయనున్నారు. కాగా, ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ప్రచారం ఊపందుకుంది. కాంగ్రెస్, బీజేపీ, ఆప్ పార్టీలు ప్రచారాన్ని ముమ్మరం చేశాయి. ప్రతి పార్టీ తమ అగ్రనాయకులను రంగంలోకి దింపుతూ ప్రజలను ఆకర్షించే ప్రయత్నాలు చేస్తున్నాయి. ఎన్నికలకు మరి కొన్ని రోజులు మాత్రమే ఉండడంతో జోరుగా ప్రచారం సాగుతోంది. పోటాపోటీలు ర్యాలీలు, బహిరంగ సభలు నిర్వహిస్తున్నారు. ఎన్నికల మ్యానిఫెస్టోలు ప్రకటిస్తూ ఓటర్లను తమవైపునకు తిప్పుకునే ప్రయత్నం చేస్తున్నాయి.

Advertisements

మరోవైపు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల విషయంలో ముఖ్య నేతలకు సీఎం చంద్రబాబు దిశానిర్దేశం చేశారు. ఉభయ గోదావరి జిల్లాలు, ఉమ్మడి కృష్ణా- గుంటూరు జిల్లాల నేతలతో నేడు ఆయన టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా గ్యాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పేరాబత్తుల రాజశేఖర్, ఆలపాటి రాజేంద్ర ప్రసాద్‌ను కూటమి అభ్యర్థులుగా బలపరిచామని తెలిపారు. ఫిభ్రవరి 27న జరిగే ఎన్నికల్లో వారిని భారీ మెజార్టీతో గెలిపించేలా చూడాలని ఆదేశించారు.

Related Posts
మేలో తల్లికి వందనం.. చంద్రబాబు కీలక ప్రకటన
మేలో తల్లికి వందనం.. చంద్రబాబు కీలక ప్రకటన

ఏపీ ప్రజలకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శుభవార్త వినిపించింది. తల్లికి వందనం నిబంధనలపై క్లారిటీ ఇచ్చింది. ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ మేరకు కీలక ప్రకటన Read more

ఏపీలో YCP సోషల్ మీడియా కార్యకర్తల వరుస అరెస్టులు
Appointment of YCP Regional

ఏపీలో వైసీపీ సోషల్ మీడియా వారిని పోలీసులు అరెస్ట్ చేస్తున్నారు. సోషల్ మీడియా వేదికగా చేసుకొని అసత్య ప్రచారాలు , నేరాలకు పాల్పడుతుండడం తో పోలీసులు రంగంలోకి Read more

నేడు ఏపిలో ‘పల్లె పండుగ’ కార్యక్రమాని ప్రారంభించనున్న డిప్యూటీ సీఎం
pawan kalyan to participate in palle panduga in kankipadu

అమరావతి: గ్రామ పంచాయతీలను అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో ఏపీ ప్రభుత్వం పల్లె పండుగ కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే. ఈ కార్యక్రమం ద్వారా గ్రామాల రూపురేఖలను Read more

స్టాలిన్‌కు కేటీఆర్‌ మద్దతు
స్టాలిన్‌కు కేటీఆర్‌ మద్దతు

కేటీఆర్ దక్షిణ భారతదేశానికి అన్యాయం అని ఎంకే స్టాలిన్ వ్యాఖ్యలను మద్దతిచ్చిన వివరణ తెలంగాణ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (కే తారక రామారావు) తమిళనాడు ముఖ్యమంత్రి Read more

×