CM Chandrababu Speech in Police Commemorative Day

అన్నింటికంటే పోలీసు శాఖ అత్యంత కీలకం: సీఎం చంద్రబాబు

విజయవాడ: నేడు పోలీసు అమరవీరుల సంస్మరణ దినం సందర్భంగా విజయవాడలో నిర్వహించిన కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..విధి నిర్వహణలో చాలా మంది పోలీసులు ప్రాణాలు విడిచి ప్రజల హృదయాల్లో త్యాగధనులుగా నిలిచారని అన్నారు. అన్నింటికంటే పోలీసు శాఖ అత్యంత కీలకమని చెప్పారు. ”ఏ ప్రగతి జరగాలన్నా పోలీసులే కీలకం. ప్రజల ప్రాణాలు, ఆస్తులు కాపాడేందుకు రాత్రింబవళ్లు కష్టపడుతున్నారు. అహర్నిశలు శ్రమిస్తున్న పోలీసులను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. ఉమ్మడి రాష్ట్రంలో నక్సలిజాన్ని ఉక్కుపాదంతో అణచివేశారు. ఫ్యాక్షనిజం, రౌడీల ఆట కట్టించారు. శాంతిభద్రతలను కాపాడటంలో ఏమాత్రం రాజీలేదు. పోలీసుల సంక్షేమం మా ప్రభుత్వం బాధ్యత. పటిష్ఠ యంత్రాంగంగా తయారు చేయడం మా కర్తవ్యం. రాష్ట్ర విభజన తర్వాత పోలీసు వ్యవస్థలో అనేక మార్పులు తీసుకొచ్చాం. వాహనాలతో పాటు పరికరాలు, సాంకేతిక సౌకర్యం కల్పించాం. ఏపీ పోలీసు అంటే దేశంలోనే మోడల్‌గా తీర్చిదిద్దాలని ముందుకెళ్లాం. 2014-2019 మధ్య రూ.600 కోట్లు ఖర్చు చేశాం. కొత్తగా వాహనాల కోసం రూ.150కోట్లు వెచ్చించాం. పోలీసు కార్యాలయాల మరమ్మతులు, నిర్వహణకు రూ.60కోట్లు ఖర్చుపెట్టాం. రూ.27కోట్లతో ఏపీఎఫ్‌ఎస్‌ఎల్‌ ఎక్విప్‌మెంట్‌ కొనుగోలు చేశాం. పోలీసు సంక్షేమానికి రూ.55 కోట్లు కేటాయించాం.

CM-Chandrababu-Speech-in-Police-Commemorative-Day
CM-Chandrababu-Speech-in-Police-Commemorative-Day

సవాళ్లను సమర్థంగా ఎదుర్కొనేందుకు దీటైన పోలీసు వ్యవస్థకు శ్రీకారం చుట్టాం. విశాఖపట్నంలో గ్రేహౌండ్స్‌ కోసం ప్రత్యేక కేంద్రం ఏర్పాటు చేశాం. కేంద్రం ఎప్పటికప్పుడు పోలీసు వ్యవస్థ ప్రక్షాళనకు ముందుకొస్తోంది. ఆధునిక ఆయుధాలు, సాంకేతిక పరిజ్ఞానం అందించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది. అధికారంలోకి వచ్చిన 125 రోజుల్లో పెండింగ్‌లో ఉన్న బిల్లులన్నీ చెల్లించాం. దిశ పేరుతో వాహనాలకు రూ.16కోట్లు, కమ్యూనికేషన్‌ పరికరాల కోసం రూ.20కోట్లు పెండింగ్‌ పెడితే వాటినీ చెల్లించాం. తప్పు చేసిన వ్యక్తిని వెంటనే పట్టుకునే వ్యవస్థ అవసరం. గత ప్రభుత్వం కక్ష సాధింపులే పనిగా పెట్టుకుంది. రాగద్వేషాలకు అతీతంగా పనిచేసేదే పోలీసు వ్యవస్థ. సర్వే రాళ్లపై బొమ్మ కోసం రూ.700 కోట్లు తగలేసిన వ్యక్తి జగన్‌. సీసీ కెమెరాల కోసం మాత్రం రూ.700 కోట్లు ఇవ్వలేకపోయారు. నేరాల తీరు మారుతోంది.. పోలీసు వ్యవస్థ అప్రమత్తంగా ఉండాలి. రాజకీయ ముసుగులో నేరాలకు పాల్పడేవారిని కఠినంగా శిక్షించాలి” అని చంద్రబాబు సూచించారు.

Related Posts
జడ్జీలపై లోక్‌పాల్ విచారణ ఆదేశాలను నిలిపివేసిన సుప్రీంకోర్టు
Supreme Court stayed the orders of Lokpal inquiry against the judges

పిటిషన్‌ను గోప్యంగా ఉంచాలని ఫిర్యాదుదారుని ఆదేశించిన సుప్రీంకోర్టు న్యూఢిల్లీ: హైకోర్టు జడ్జిలను విచారించే అధికారం తమకు ఉందంటూ లోక్‌పాల్ జారీ చేసిన ఉత్తర్వులపై సుప్రీంకోర్టు స్టే విధించింది. Read more

కేటీఆర్ కు భయం పట్టుకుంది – కాంగ్రెస్ విప్ ఆది శ్రీనివాస్
Congress VIP adisrinivas

ప్రభుత్వ చీఫ్ విప్ ఆది శ్రీనివాస్ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ , మాజీ మంత్రి కేటీఆర్‌పై తీవ్రమైన ఆరోపణలు చేశారు. హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడుతున్న.. గత పది Read more

ఏపీ సర్కార్ తో గూగుల్ కీలక ఒప్పందం
Google signed a key agreement with AP Sarkar

ఆంధ్రప్రదేశ్, డిసెంబర్ 2024: రాష్ట్రవ్యాప్తంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) విస్తరణ మరియు స్వీకరణను వేగవంతం చేయడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో గూగుల్ ఈరోజు వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని చేసుకున్నట్లు ప్రకటించింది. Read more

రెండో రోజు కొనసాగుతున్న తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు
Telangana Assembly sessions continue for second day

హైదరాబాద్‌: నేడు రెండో రోజు బడ్జెట్ అసెంబ్లీ సమావేశాలు కొనసాగుతున్నాయి. బుధవారం ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ జిష్ణుదేవా వర్మ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ Read more

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *