CM Chandrababu review of budget proposals

బడ్జెట్ ప్రతిపాదనలపై సీఎం చంద్రబాబు సమీక్ష

ఈ ఏడాదే తల్లికి వందనం, అన్నదాత, ఉచిత బస్సు పై చర్చ

అమరావతి: ఈనెల 28న ఉభయ సభల్లో 2025-26 వార్షిక బడ్జెట్ ప్రవేశ పెట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమవుతోంది. 24 నుంచి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానుండటంతో వార్షిక బడ్జెట్‌పై సీఎం చంద్రబాబు ఉండవల్లి లోని తన నివాసంలో సమీక్షించారు. ఆర్థికమంత్రి పయ్యావుల కేశవ్, ఇతర ఉన్నతాధికారులు సమావేశంలో పాల్గొన్నారు.

Advertisements
image

ఈ ఏడాది నుంచి సూపర్ సిక్స్ పథకాలు అమలు చేయాలని ఇప్పటికే ప్రకటించినందున బడ్జెట్‌లో అందుకు తగ్గ కేటాయింపులపై కీలకంగా చర్చించినట్టు తెలుస్తోంది. తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం వంటి పథకాల అమలుకు ఈ ఏడాది నుంచే శ్రీకారం చుట్టేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. అటు పథకాలు, ఇటు అభివృద్ధి కార్యక్రమాలను సమన్వయం చేసుకుంటూ బడ్జెట్ కేటాయింపులు చేయడం సర్కార్కు సవాల్‌గా మారింది. సవాళ్లను అధిగమించాల్సిన అంశాలపై అధికారులకు సీఎం చంద్రబాబు దిశానిర్దేశం చేశారు.

కూటమి ప్రభుత్వం వచ్చిన తరువాత ఉచిత ఇసుక వంటి పాలసీతో ప్రభుత్వం ఆదాయం వదులుకున్న విషయాన్ని గుర్తు చేసుకున్నారు. అధికారంలోకి వచ్చిన మొదటి నెల నుంచే పింఛన్ల పెంచడంతోపాటు నెలకు రూ.2,720 కోట్లు ప్రభుత్వం వెచ్చిస్తోందనే విషయం ప్రస్తావనకు వచ్చినట్లు తెలుస్తోంది. పోలవరం, అమరావతి వంటి ప్రాజెక్టులకు కేంద్ర సాయంతో కొంత ఊరట లభించిందని ప్రభుత్వ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

Related Posts
ఏపీలో అర్హులైన అందరికి త్వరలో నూతన రేషన్ కార్డులు
New ration cards for all eligible in AP soon

అమరావతి: రేషన్ కార్డు లేని అర్హులైన పేదలకు త్వరలోనే వాటిని మంజూరు చేయాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. రేషన్‌కార్డుల్లో పేరు మార్పు చేర్పులకు కూడా అవకాశం ఇవ్వనుంది. Read more

సీఎంఆర్ చెల్లింపుల గడువు పెంచిన తెలంగాణ ప్రభుత్వం
11

హైదరాబాద్‌: సీఎం రేవంత్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని రైస్ మిల్లులు ప్రభుత్వానికి చెల్లించే సీఎంఆర్‌ బకాయిల గడువు తేదీని మరో 3 నెలల Read more

న్యూజిలాండ్ ఎంపీ హాన-రావితి మైపీ-క్లార్క్, “హాకా” నిరసనతో చర్చల్లో ..?
Hana Rawhiti

న్యూజిలాండ్‌కు చెందిన 22 ఏళ్ల యువ ఎంపీ హాన-రావితి మైపీ-క్లార్క్, ఒక వివాదాస్పద బిల్లుపై తన నిరసన వ్యక్తం చేయడంతో దేశవ్యాప్తంగా ప్రకంపనలు రేపింది. ఈ యువ Read more

Weather Report : తెలంగాణ లో రానున్న రెండ్రోజులు వాతావరణం ఎలా ఉంటుందంటే?
Rains 24 గంటల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు AP

తెలంగాణలో వాతావరణ పరిస్థితులు మార్చబడుతున్నాయి. భారత వాతావరణ శాఖ (IMD) తెలిపిన ప్రకారం, ద్రోణి ప్రభావంతో రాష్ట్రంలో రానున్న రెండు రోజులు మిశ్రమ వాతావరణం ఉండబోతోంది. పగటిపూట Read more

×