CM Chandrababu ongoing visit to Delhi . Meeting with Union Ministers

ఢిల్లీలో కొనసాగుతున్న సీఎం చంద్రబాబు పర్యటన .. కేంద్రమంత్రులతో భేటీ!

న్యూఢిల్లీ : ఏపీ సీఎం చంద్రబాబు ఢిల్లీ పర్యటనలో బిజీ బిజీగా గడుపుతున్నారు. తన షెడ్యూల్‌లో భాగంగా నేడు పలువురు కేంద్ర మంత్రులతో ఆయన భేటీ కానున్నారు. ఉదయం 11:30 గంటలకు కేంద్రమంత్రి నితిన్ గడ్కరీతో సమావేశం కానున్నారు. సాయంత్రం 4.30కు కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్‌తో సమావేశమవుతారు. అనంతరం 5:45 గంటలకు కేంద్ర పెట్రోలియం సహజ వనరుల శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరితో భేటీ కానున్నారు.

ఇక రాత్రి 8 గంటలకు కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో ఏపీ సీఎం చంద్రబాబు సమావేశం కానున్నారు. రాత్రి 11:15 గంటలకు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్‌తో చంద్రబాబు సమావేశమవుతారు. వరద సాయం, రాజధాని అమరావతి అవుటర్ రింగ్ రోడ్, జాతీయ రహదారుల అభివృద్ధి, విశాఖ స్టీల్ ప్లాంట్ సమస్యకు శాశ్వత పరిష్కారం,రాష్ట్రంలో పెట్రోలియం రిఫైనరీ ఏర్పాటు, బడ్జెట్లో ప్రకటించిన పారిశ్రామిక కారిడార్ల అభివృద్ధి గురించి ఈ సందర్భంగా కేంద్రమంత్రులతో చర్చించి నిధుల విడుదల గురించి ప్రస్తావించనున్నారు.

Related Posts
అక్రమ వలసదారులను తరలించేందుకు యూఎస్ భారీ ఖర్చు
US deporting millions of il

అమెరికాలోని అక్రమ వలసదారులను స్వదేశాలకు పంపించేందుకు అమెరికా ప్రభుత్వం భారీగా ఖర్చు చేస్తున్నట్లు నివేదికలు చెబుతున్నాయి. ఒక్కో వలసదారుని పంపించేందుకు సుమారు 4,675 డాలర్లు (రూ.4 లక్షలు) Read more

ఏపీలో డైకిన్ కర్మాగారం ఏర్పాటు
daikin

ఏపీలో కూటమి అధికారంలోకి రావడంతో చంద్రబాబు చొరవతో పలు పరిశ్రమలు ఏర్పాటు చేసేందుకు ముందుకొస్తున్నాయి. తాజాగా ఆంధ్రప్రదేశ్ లో వెయ్యి కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు జపాన్ కు Read more

శ్రీశైలం-హైదరాబాద్ హైవేపై చిరుత హల్చల్
leopard was spotted crossin

శ్రీశైలం-హైదరాబాద్ హైవేపై అర్ధరాత్రి చిరుతపులి కనిపించడం అక్కడి ప్రయాణికులకు షాక్ కలిగించింది. నాగర్ కర్నూలు జిల్లాలోని వటవర్లపల్లి వద్ద చిరుత రోడ్డు దాటుతుండగా, కారులో ఉన్న ప్రయాణికులు Read more

లండ‌న్ వేదికగా వరల్డ్ ట్రావెల్ మార్కెట్ ప్రారంభించిన మంత్రి జూపల్లి
jupalli

లండ‌న్ వేదిక‌గా ఎక్సెల్ హాల్స్‌లో జరుగుతున్న 44వ వరల్డ్ ట్రావెల్ మార్ట్ లో తెలంగాణ పర్యాటక సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా Read more