CBN Nellour

పథకాలపై సీఎం చంద్రబాబు కీలక ప్రకటన

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట్ర ప్రజలకు శుభవార్త ప్రకటించారు. ముఖ్యంగా తల్లికి వందనం పథకంపై స్పష్టత ఇచ్చారు. ఇంట్లో ఎంత మంది పిల్లలున్నా, ప్రతీ ఒక్కరికీ రూ.15,000 చొప్పున మే నెలలో అందజేస్తామని వెల్లడించారు. దీని ద్వారా విద్యార్థుల చదువుకు ఏ విధంగా అవరోధాలు లేకుండా చూడగలుగుతామన్న ఉద్దేశంతో ప్రభుత్వం ముందుకెళ్తుందని చంద్రబాబు పేర్కొన్నారు. ఈ నిర్ణయం ద్వారా లక్షలాది మంది విద్యార్థులు ప్రయోజనం పొందనున్నారు.

Advertisements

రైతుల కోసం ప్రభుత్వం మరో కీలక నిర్ణయం

ఇక రైతుల కోసం ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. త్వరలోనే ఒక్కో రైతుకు రూ.20,000 ఆర్థిక సాయం అందజేయనున్నట్లు సీఎం ప్రకటించారు. రైతుల సంక్షేమమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని, వ్యవసాయ రంగాన్ని అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తున్నామని స్పష్టం చేశారు. రైతులకు ఎటువంటి ఆర్థిక ఇబ్బందులు కలగకుండా, సాగు కొనసాగించేందుకు కావాల్సిన ప్రోత్సాహకాలు అందజేయాలని ప్రభుత్వం సంకల్పించింది.

మత్స్యకార కుటుంబాలకు రూ.20 వేల సాయం

ఇదే విధంగా మత్స్యకార కుటుంబాలను కూడా ప్రభుత్వం విస్మరించబోమని చంద్రబాబు హామీ ఇచ్చారు. రాష్ట్రంలోని మత్స్యకార కుటుంబాలకు కూడా రూ.20,000 ఆర్థిక సాయం అందజేయనున్నట్లు వెల్లడించారు. సముద్రంలో చేపల వేటకు వెళ్లే మత్స్యకారులకు అవసరమైన అన్ని వసతులు కల్పించడంతో పాటు, వారికి ఆర్థిక భరోసా ఇచ్చేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందని తెలిపారు.

ఇక ఉపాధ్యాయ అభ్యర్థుల కోసం మరో ముఖ్యమైన ప్రకటన చేశారు. జూన్ నాటికి DSC ప్రక్రియ పూర్తవుతుందని చంద్రబాబు స్పష్టం చేశారు. రాష్ట్రంలో ఉపాధ్యాయ పోస్టుల భర్తీ కోసం అనేక మంది ఎదురు చూస్తున్నారు. వారికి మంచి అవకాశాలు కల్పించేందుకు ప్రభుత్వం చొరవ తీసుకుంటుందని సీఎం తెలిపారు. అన్ని వర్గాల ప్రజలకు మేలు చేసేలా పాలన కొనసాగిస్తామని, ఇచ్చిన హామీలను అమలు చేస్తూ ముందుకు వెళ్తామని చంద్రబాబు మరోసారి పునరుద్ఘాటించారు.

Related Posts
Delhi: చల్లనైన మనసు గల ప్రిన్సిపల్ ఏం చేసిందంటే?
Delhi: చల్లనైన మనసు గల ప్రిన్సిపల్ ఏం చేసిందంటే?

వేసవి వేడి భరించలేని స్థాయికి చేరిన ఈరోజుల్లో, ఢిల్లీ యూనివర్సిటీ పరిధిలోని ఓ కాలేజీ ప్రిన్సిపల్ చేసిన పని నెట్టింటా హాట్ టాపిక్ అయింది. ఈ ఘటన Read more

Ram Charan : గ్లోబల్ స్టార్ కు పుట్టిన రోజు శుభాకాంక్షలు
charan fans

మెగాస్టార్ చిరంజీవి వారసుడిగా సినీ ఇండస్ట్రీలో అడుగుపెట్టిన రామ్ చరణ్.. 'చిరుత' సినిమాతో తన ప్రయాణాన్ని ప్రారంభించారు. తొలి సినిమాతోనే మంచి మార్కులు కొట్టేసిన చరణ్, తన Read more

కుటుంబ సర్వేపై విచారణ జరిపించాలి : షబ్బీర్ అలీ
CID should investigate comprehensive family survey.. Shabbir Ali

హైదరాబాద్‌: ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన కొత్తలో టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన విషయం తెలిసిందే. ఆనాడు టీఆర్ఎస్ సర్కార్ నిర్వహించిన సమగ్ర కుటుంబ సర్వేపై సీఐడీ Read more

ఇజ్రాయెల్‌ ప్రధాని నెతన్యాహు నివాసంపై డ్రోన్‌ దాడి
Drone attack on Israeli Prime Minister Netanyahus residence

న్యూఢిల్లీ: పశ్చిమాసియాలో తీవ్ర ఘర్షణవాతావరణం నెలకొంది. ఈ తరుణంలో ఆందోళనకర ఘటన చోటుచేసుకున్నట్లు తెలుస్తోంది. ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు ఇంటి సమీపంలో డ్రోన్‌ దాడి జరిగిందని Read more

×