CM Chandrababu Naidu visits Tirumala temple

Chandrababu : తిరుమల శ్రీవారిని దర్శించుకున్న సీఎం చంద్రబాబు

Chandrababu : ఈరోజు ఉదయం తిరుమల శ్రీవారిని సీఎం చంద్రబాబు దర్శించుకున్నారు. తన మనవడు, మంత్రి నారా లోకేష్ తనయుడు నారా దేవాన్ష్ పుట్టినరోజును పురస్కరించుకుని ఆయన కుటుంబ సభ్యులతో కలిసి శ్రీవారి సేవలో పాల్గొన్నారు. గురువారం సాయంత్రమే నారా భువనేశ్వరి, నారా బ్రాహ్మణి, దేవాన్ష్‌లు తిరుమలకు చేరుకున్నారు. సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్ గురువారం రాత్రి 11.30 గంటల ప్రాంతంలో తిరుమలకు చేరుకున్నారు. రాత్రికి పద్మావతి గెస్ట్ హౌస్‌లో బస చేశారు.

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న సీఎం

కుటుంబానికి తీర్థ ప్రసాదాలు

నేటి ఉదయం సీఎం చంద్రబాబుకు ఆలయ మహాద్వారం వద్ద టీటీడీ ఛైర్మన్‌ బీఆర్‌ నాయుడు, అర్చకులు స్వాగతం పలికారు. సీఎం చంద్రబాబు తన సతీమణి నారా భువనేశ్వరి, కుమారుడు మంత్రి నారా లోకేష్, కోడలు నారా బ్రాహ్మణి, మనవడు నారా దేవాన్ష్‌లతో కలిసి శుక్రవారం ఉదయం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. అందుకోసం అధికారులు ఏర్పాటు చేశారు. దర్శనం అనంతరం అర్చకులు చంద్రబాబు కుటుంబానికి తీర్థ ప్రసాదాలు ఇచ్చి ఆశీర్వదించారు.

నారా దేవాన్ష్ పేరుతో అన్నదానం

శ్రీవారి దర్శనం అనంతరం తరిగొండ వెంగమాంబ సత్రంలో తన మనవడు, బర్త్ డే బాయ్ నారా దేవాన్ష్ పేరుతో అన్నదానం నిర్వహించేందుకు ఏర్పాటు చేశారు. స్వయంగా సీఎం చంద్రబాబు, ఆయన కుటుంబ సభ్యులు అన్న ప్రసాదాలు భక్తులకు వడ్డించనున్నారు. కార్యక్రమం పూర్తయ్యాక శుక్రవారం మధ్యాహ్నం చంద్రబాబు తిరుమల నుంచి బయలుదేరి హైదరాబాద్‌ చేరుకోనున్నారని అధికారులు తెలిపారు.

Related Posts
కూటమికి ఉద్యోగ నేత రెడ్ బుక్ వార్నింగ్
kakarla venkatram reddy

వెంకట్రాc ముఖ్యంగా పెన్షన్ల పంపిణీ విషయంలో ప్రభుత్వం ఉద్యోగులను టార్గెట్ చేస్తోందని ఆయన ఆరోపిస్తున్నారు. ఇదే పరిస్ధితి కొనసాగితే ఉద్యోగులు ఏం చేయాలో కూడా ఆయన చెప్పేశారు.గత Read more

కన్నడ నటుడు దర్శనికి మధ్యంతర బెయిల్
kannada actor darshan

కన్నడ సినీ పరిశ్రమలో పెద్ద కలకలం రేపిన రేణుకాస్వామి హత్య కేసులో నిందితుడిగా ఉన్న ప్రముఖ నటుడు దర్శన్‌కి మధ్యంతర బెయిల్‌ మంజూరైంది. వెన్నెముకకు శస్త్రచికిత్స అవసరమని Read more

ఏపీలో మరో రెండు బీసీ గురుకులాలు
Two more BC Gurukulas in AP

ఏపీలో ప్రస్తుతం 107 బీసీ గురుకులాలు ఉన్న సంగతి తెలిసిందే. తాజా సమాచారం ప్రకారం.. రాష్ట్ర ప్రభుత్వం మరో రెండు కొత్త గురుకులాలను ప్రారంభించనుంది. ఈ గురుకులాలు Read more

స్విగ్గీ సర్వ్స్ గొప్ప కార్యక్రమం ప్రారంభం
Swiggy serves a great start

ప్రముఖ ఆహార సరఫరా సంస్థ స్విగ్గీ సామాజిక బాధ్యతతో మరో అడుగు ముందుకు వేసింది. నిత్యం రెస్టారెంట్లలో మిగిలిపోయే ఆహారాన్ని వృథా కాకుండా పేదలకు అందించాలన్న సంకల్పంతో Read more

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *