CM Chandrababu Naidu to Tirumala with family today

CM Chandrababu : నేడు కుటుంబసమేతంగా తిరుమలకు సీఎం చంద్రబాబు

CM Chandrababu : సీఎం చంద్రబాబు నాయుడు ఈరోజు, రేపు తిరుమలలో పర్యటించనున్నారు. పర్యటనకు ఇందులో భాగంగానే నేడు రాత్రి తిరుమల చేరుకోనున్నారు సీఎం చంద్రబాబు నాయుడు. రేపు సీఎం చంద్రబాబు మనవడు దేవాన్ష్ పుట్టినరోజు. ఈ సందర్భంగా కుటుంబ సభ్యులతో కలసి చంద్రబాబు శ్రీవారిని దర్శించుకోనున్నారు. దేవాన్ష్ పుట్టినరోజు సందర్భంగా అన్నదానం ఒక్కరోజు విరాళం అందించనున్నారు చంద్రబాబు నాయుడు సతీమణి భువనేశ్వరి.

నేడు కుటుంబ సమేతంగా తిరుమలకు

ఒకరోజు మొత్తం ఖర్చు 44 లక్షలు

దీనికి అవసరమైన ఒకరోజు మొత్తం ఖర్చు 44 లక్షల రూపాయలను టీటీడీ శ్రీవేంకటేశ్వర అన్నప్రసాదం ట్రస్ట్‌కు విరాళంగా అందించనున్నారు. ఈ సందర్భంగా తరిగొండ వెంగమాంబ అన్నప్రసాద కేంద్రంలో భక్తులకు అన్నప్రసాదం వడ్డించనున్నారు. ఇక, ముఖ్యమంత్రి చంద్రబాబు కుటుంబం ప్రతి ఏటా నారా దేవాన్ష్ పుట్టిన రోజు నాడు తిరుమల శ్రీవారిని దర్శించుకోవడం ఆనవాయితీగా వస్తోంది. ఆరోజు తరిగొండ వెంగమాంబ అన్నప్రసాద కేంద్రంలో భక్తులకు అన్నప్రసాదాన్ని స్వయంగా వడ్డిస్తారు. ఆ రోజు మొత్తం అయ్యే ఖర్చును చంద్రబాబు కుటుంబం టీటీడీకి అందజేస్తోంది.

ఉగాది పండగను అత్యంత వైభవంగా

కాగా, ఈ నెల 30వ తేదీన తెలుగు సంవత్సరాది ఉగాది పండగ. శ్రీ విశ్వావసు నామ ఉగాది పండగను అత్యంత వైభవంగా నిర్వహించడానికి టీటీడీ అధికారులు చర్యలు తీసుకుంటోన్నారు. అదే రోజున వేలాదిమంది భక్తుల సమక్షంలో శ్రీ‌వారి ఆల‌యంలో ఉగాది ఆస్థానాన్ని శాస్త్రోక్తంగా చేపట్టనున్నారు.

Related Posts
TTD : తెలంగాణ ప్ర‌జల‌కు టీటీడీ శుభ‌వార్త‌ చెప్పింది
TTD తెలంగాణ ప్ర‌జల‌కు టీటీడీ శుభ‌వార్త‌ చెప్పింది

TTD : తెలంగాణ ప్ర‌జల‌కు టీటీడీ శుభ‌వార్త‌ చెప్పింది తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) తాజాగా తెలంగాణ ప్రజాప్రతినిధులకు శుభవార్త అందించింది. ఇకపై తెలంగాణ ప్రజాప్రతినిధుల సిఫార్సు Read more

నెల్సన్ కథకు ఓకే చెప్పిన జూ.ఎన్టీఆర్..?
ntr nxt movie

'జైలర్' ఫేమ్ నెల్సన్ దిలీప్ కుమార్ డైరెక్షన్లో జూ.ఎన్టీఆర్ ఓ సినిమాలో నటించే అవకాశం కన్పిస్తోంది. ఇటీవల దర్శకుడు చెప్పిన కథకు యంగ్ టైగర్ ఓకే చెప్పారని Read more

తెలంగాణలో కాంగ్రెస్ మంత్రుల మధ్య విభేదాలు
తెలంగాణలో కాంగ్రెస్ మంత్రుల మధ్య విభేదాలు

మంత్రులు, ఎంఎల్ఎల మధ్య సమన్వయం లేకపోవడం, పార్టీ కార్యకర్తలు, నాయకుల మధ్య పెరుగుతున్న అంతరం, విధేయులు, తిరుగుబాటు ఎంఎల్ఎల మధ్య నామినేటెడ్ పోస్టుల భర్తీపై విభేదాలు తెలంగాణలో Read more

19న బీఆర్‌ఎస్‌ విస్తృతస్థాయి కార్యవర్గ సమావేశం
KCR to hold BRS executive meet on February 19

పార్టీ నిర్మాణం, భవిష్యత్ కార్యాచరణపై చర్చించేందుకు బీఆర్‌ఎస్‌ సిద్ధమైంది. హైదరాబాద్‌: ఫిబ్రవరి 19న మాజీ సీఎం కేసీఆర్ అధ్యక్షతన బీఆర్ఎస్ పార్టీ విస్తృత స్థాయి కార్యవర్గ సమావేశం Read more

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *