CM Chandrababu Naidu to meet Bill Gates tomorrow

CM Chandrababu: రేపు బిల్‌ గేట్స్‌తో సీఎం చంద్రబాబు భేటీ

CM Chandrababu: గేట్స్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు బిల్ గేట్స్‌తో ముఖ్యమంత్రి చంద్రబాబు రేపు (బుదవారం) మధ్యాహ్నం ఢిల్లీలో సమావేశం కానున్నారు. విద్య, ఆరోగ్యం, వ్యవసాయం వంటి రంగాల్లో గేట్స్ ఫౌండేషన్ రాష్ట్ర ప్రభుత్వానికి సహకారం అందించనుంది. ఈ అంశాలపై ఏపీ ప్రభుత్వం, గేట్స్ ఫౌండేషన్ ఒప్పందాలు చేసుకోనున్నట్లు సమాచారం. కాగా మంగళవారం సాయంత్రం సీఎం చంద్రబాబు అమరావతి నుంచి బయలుదేరి ఢిల్లీ వెళ్తారు.

Advertisements
రేపు బిల్‌ గేట్స్‌తో సీఎం

కుటుంబ సభ్యులతో కలిసి శ్రీవారి దర్శనం

బిల్​గేట్స్​తో భేటీ అనంతరం చంద్రబాబు అమరావతికి తిరిగి రానున్నారు. 20న అసెంబ్లీ సమావేశాల్లో చంద్రబాబు పాల్గొంటారు. అదేరోజు రాత్రికి అమరావతి నుంచి తిరుమల వెళ్తారు. 21న ముఖ్యమంత్రి తిరుమలలో కుటుంబ సభ్యులతో కలిసి శ్రీవారి దర్శనం చేసుకోనున్నారు. 21న కుటుంబ సమేతంగా మనువడు దేవాన్ష్ పుట్టినరోజు సందర్భంగా శ్రీవారిని దర్శించుకుంటారు.

రాజధాని పునర్నిర్మాణ పనుల శంకుస్థాపన

మరోవైపు ముఖ్యమంత్రి చంద్రబాబు మంగళవారం ఢిల్లీలో ప్రధాని మోడీ, ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌తో భేటీ కానున్నారు. రాజధాని పునర్నిర్మాణ పనుల శంకుస్థాపనకు ప్రధాని మోడీని సీఎం ఆహ్వానించనున్నారు. పెండింగ్‌ నిధులు విడుదల చేయాలని ఆర్థికమంత్రి నిర్మలాను కోరనున్నారు. అనంతరం ఢిల్లీలో ఓ వివాహ వేడుకలో సీఎం పాల్గొననున్నారు.

Related Posts
భారత్ సమ్మిట్ కు ఒబామా హాజరు: రేవంత్ రెడ్డి
భారత్ సమ్మిట్‌కు ఒబామా హాజరు! సీఎం రేవంత్ రెడ్డి ప్రకటన

ఇది తెలంగాణలో రాజకీయంగా చర్చనీయాంశమైన అంశం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇటీవల ప్రకటించిన 'భారత్ సమ్మిట్'తో పాటు, రాష్ట్రంలో పెట్టుబడులు, అభివృద్ధి కార్యక్రమాలు, బీజేపీపై విమర్శలు, లోక్‌సభ Read more

Telangana: ఏప్రిల్‌ 3న కొత్త మంత్రుల ప్రమాణ స్వీకారం ?
New ministers to be sworn in on April 3?

Telangana: తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గ విస్తరణకు ఏఐసీసీ గ్రీన్ సిగ్న‌ల్ఇచ్చింది. ఏప్రిల్‌ 3న కొత్త మంత్రుల ప్రమాణ స్వీకారం ఉండే అవకాశం ఉంది. ఇద్దరు బీసీలు, రెడ్డి, Read more

Time’s Influential People: ప్రతిభావంతుల జాబితాలో భారతీయుడికి దక్కని చోటు
ప్రతిభావంతుల జాబితాలో భారతీయుడికి దక్కని చోటు

ప్రపంచ ప్రఖ్యాత టైమ్స్ మ్యాగజైన్ ప్రతీ సంవత్సరం విడుదల చేసే ‘టాప్ 100 మోస్ట్ ఇన్‌ఫ్లుఎన్షియల్ పీపుల్’ జాబితా 2025 సంవత్సరానికి విడుదలైంది. ఈ జాబితాలో ప్రపంచ Read more

వైజాగ్, విజయవాడ మెట్రో ప్రాజెక్టులకు ఏపీ సర్కార్ గ్రీన్ సిగ్నల్
vizag metro

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వైజాగ్ మరియు విజయవాడ మెట్రో ప్రాజెక్టుల కోసం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. మెట్రో నిర్మాణం ద్వారా నగరాల్లో ట్రాఫిక్ సమస్యలు తగ్గించడంతో పాటు, ప్రజలకు Read more

Advertisements

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×