CM Chandrababu Naidu to meet Bill Gates tomorrow

CM Chandrababu: రేపు బిల్‌ గేట్స్‌తో సీఎం చంద్రబాబు భేటీ

CM Chandrababu: గేట్స్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు బిల్ గేట్స్‌తో ముఖ్యమంత్రి చంద్రబాబు రేపు (బుదవారం) మధ్యాహ్నం ఢిల్లీలో సమావేశం కానున్నారు. విద్య, ఆరోగ్యం, వ్యవసాయం వంటి రంగాల్లో గేట్స్ ఫౌండేషన్ రాష్ట్ర ప్రభుత్వానికి సహకారం అందించనుంది. ఈ అంశాలపై ఏపీ ప్రభుత్వం, గేట్స్ ఫౌండేషన్ ఒప్పందాలు చేసుకోనున్నట్లు సమాచారం. కాగా మంగళవారం సాయంత్రం సీఎం చంద్రబాబు అమరావతి నుంచి బయలుదేరి ఢిల్లీ వెళ్తారు.

Advertisements
రేపు బిల్‌ గేట్స్‌తో సీఎం

కుటుంబ సభ్యులతో కలిసి శ్రీవారి దర్శనం

బిల్​గేట్స్​తో భేటీ అనంతరం చంద్రబాబు అమరావతికి తిరిగి రానున్నారు. 20న అసెంబ్లీ సమావేశాల్లో చంద్రబాబు పాల్గొంటారు. అదేరోజు రాత్రికి అమరావతి నుంచి తిరుమల వెళ్తారు. 21న ముఖ్యమంత్రి తిరుమలలో కుటుంబ సభ్యులతో కలిసి శ్రీవారి దర్శనం చేసుకోనున్నారు. 21న కుటుంబ సమేతంగా మనువడు దేవాన్ష్ పుట్టినరోజు సందర్భంగా శ్రీవారిని దర్శించుకుంటారు.

రాజధాని పునర్నిర్మాణ పనుల శంకుస్థాపన

మరోవైపు ముఖ్యమంత్రి చంద్రబాబు మంగళవారం ఢిల్లీలో ప్రధాని మోడీ, ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌తో భేటీ కానున్నారు. రాజధాని పునర్నిర్మాణ పనుల శంకుస్థాపనకు ప్రధాని మోడీని సీఎం ఆహ్వానించనున్నారు. పెండింగ్‌ నిధులు విడుదల చేయాలని ఆర్థికమంత్రి నిర్మలాను కోరనున్నారు. అనంతరం ఢిల్లీలో ఓ వివాహ వేడుకలో సీఎం పాల్గొననున్నారు.

Related Posts
సింగపూర్ ప్రముఖులతో రేవంత్ రెడ్డి భేటీ
cm revanth reddy

దావోస్ పర్యటనలో వున్న తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సింగపూర్ ప్రముఖులతో భేటీ అయ్యారు. ఈ పర్యటనలో కీలక ఒప్పందం జరిగింది. సింగపూర్ విదేశాంగ మంత్రి వివి Read more

Murder: స్నేహితుడిని కొట్టి చంపినా యువకులు
Murder: స్నేహితుడిని కొట్టి చంపినా యువకులు

స్నేహితులే ప్రాణం తీసిన దారుణం మేడ్చల్‌ జిల్లా జవహర్‌నగర్‌ పోలీస్ స్టేషన్ పరిధిలోని యాప్రాల్‌లో దారుణ ఘటన చోటుచేసుకుంది. గంజాయి అమ్ముతున్నట్లు తప్పుడు ప్రచారం చేశాడన్న నెపంతో Read more

మెడికల్ టెస్టుల్లో పోసానికి గుండె సమస్యలు
మెడికల్ టెస్టుల్లో పోసానికి గుండె సమస్యలు

చంద్రబాబు, పవన్ కళ్యాణ్, నారా లోకేష్ సహా కూటమి నేతలపై అనుచిత వ్యాఖ్యల కేసులో ఆరోపణలు ఎదుర్కొంటూ అరెస్టు అయిన టాలీవుడ్ నటుడు, వైసీపీ నేత పోసాని Read more

అమెజాన్, ఫ్లిప్‌కార్ట్, మెటా, ఆపిల్ పై CCI దర్యాప్తు
apps

కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా (CCI) ప్రస్తుతం పెద్ద సాంకేతిక సంస్థలపై తీసుకుంటున్న చర్యలను వేగవంతం చేస్తోంది. ఈ సంస్థలు, అమెజాన్, ఫ్లిప్‌కార్ట్, మెటా, మరియు ఆపిల్ Read more

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×