CM Chandrababu Naidu to meet Bill Gates tomorrow

CM Chandrababu: రేపు బిల్‌ గేట్స్‌తో సీఎం చంద్రబాబు భేటీ

CM Chandrababu: గేట్స్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు బిల్ గేట్స్‌తో ముఖ్యమంత్రి చంద్రబాబు రేపు (బుదవారం) మధ్యాహ్నం ఢిల్లీలో సమావేశం కానున్నారు. విద్య, ఆరోగ్యం, వ్యవసాయం వంటి రంగాల్లో గేట్స్ ఫౌండేషన్ రాష్ట్ర ప్రభుత్వానికి సహకారం అందించనుంది. ఈ అంశాలపై ఏపీ ప్రభుత్వం, గేట్స్ ఫౌండేషన్ ఒప్పందాలు చేసుకోనున్నట్లు సమాచారం. కాగా మంగళవారం సాయంత్రం సీఎం చంద్రబాబు అమరావతి నుంచి బయలుదేరి ఢిల్లీ వెళ్తారు.

Advertisements
రేపు బిల్‌ గేట్స్‌తో సీఎం

కుటుంబ సభ్యులతో కలిసి శ్రీవారి దర్శనం

బిల్​గేట్స్​తో భేటీ అనంతరం చంద్రబాబు అమరావతికి తిరిగి రానున్నారు. 20న అసెంబ్లీ సమావేశాల్లో చంద్రబాబు పాల్గొంటారు. అదేరోజు రాత్రికి అమరావతి నుంచి తిరుమల వెళ్తారు. 21న ముఖ్యమంత్రి తిరుమలలో కుటుంబ సభ్యులతో కలిసి శ్రీవారి దర్శనం చేసుకోనున్నారు. 21న కుటుంబ సమేతంగా మనువడు దేవాన్ష్ పుట్టినరోజు సందర్భంగా శ్రీవారిని దర్శించుకుంటారు.

రాజధాని పునర్నిర్మాణ పనుల శంకుస్థాపన

మరోవైపు ముఖ్యమంత్రి చంద్రబాబు మంగళవారం ఢిల్లీలో ప్రధాని మోడీ, ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌తో భేటీ కానున్నారు. రాజధాని పునర్నిర్మాణ పనుల శంకుస్థాపనకు ప్రధాని మోడీని సీఎం ఆహ్వానించనున్నారు. పెండింగ్‌ నిధులు విడుదల చేయాలని ఆర్థికమంత్రి నిర్మలాను కోరనున్నారు. అనంతరం ఢిల్లీలో ఓ వివాహ వేడుకలో సీఎం పాల్గొననున్నారు.

Related Posts
వామ్మో.. నీతా అంబానీ వాడే వాటర్ బాటిల్ విలువ రూ. 49 లక్షలు
nita ambani water bottle co

రిలయన్స్ అధినేత ముకేశ్ భార్య నీతా అంబానీ తాగే వాటర్ బాటిల్ విలువ అక్షరాలా రూ.49 లక్షలు. నీతా అంబానీ, ప్రముఖ పారిశ్రామికవేత్త ముఖేష్ అంబానీ భార్యగా, Read more

తల్లిని చిత్రహింసలు పెట్టిన కూతురు వీడియో వైరల్
తల్లిని చిత్రహింసలు పెట్టిన కూతురు వీడియో వైరల్

హర్యానాలోని హిస్సార్‌లో మానవత్వానికే మచ్చలా మారిన ఘోర ఘటన వెలుగు చూసింది. ఆస్తి కోసం కన్నతల్లిని చిత్రహింసలు పెట్టిన కూతురు అమానుషంగా ప్రవర్తించింది. తల్లిని దారుణంగా కొడుతూ, Read more

సీఎం చంద్రబాబుకు సుప్రీంకోర్టులో ఊరట..
CM Chandrababu gets relief in Supreme Court

న్యూఢిల్లీ: ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు సుప్రీంకోర్టులో ఊరట లభించింది. చంద్రబాబుపై నమోదైన కేసులను సీబీఐకి బదిలీ చేయాలని నమోదైన పిటిషన్ ను సుప్రీంకోర్టు కొట్టివేసింది. సీఐడీ కేసులను Read more

కులగణన రీసర్వే నేటితో లాస్ట్
Caste census survey ends to

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన కులగణన రీసర్వే నేడు (ఫిబ్రవరి 28, 2025) ముగియనుంది. గతేడాది నవంబర్ 6 నుంచి డిసెంబర్ 25 వరకు ఈ సర్వేను Read more

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×