- తనే స్వయంగా రూ.1 లక్షకు టికెట్ కొనుగోలు
ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు ఎన్టీఆర్ ట్రస్ట్ నిర్వహించిన యుఫోరియా మ్యూజికల్ నైట్ కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ ఈవెంట్ ద్వారా తలసేమియా బాధితులకు నిధులు సేకరించాలనే లక్ష్యాన్ని ఆయన ప్రశంసించారు. ఈ కార్యక్రమం ద్వారా ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ నారా భువనేశ్వరి తన నేతృత్వాన్ని మరింత రుజువు చేసుకున్నారని చంద్రబాబు అభిప్రాయపడ్డారు. ఎన్టీఆర్ సేవా గుణాన్ని కొనసాగిస్తూ ట్రస్ట్ సమర్థవంతంగా నడుపుతున్నారని అన్నారు.

ఈ కార్యక్రమానికి తనే స్వయంగా రూ.1 లక్షకు టికెట్ కొనుగోలు చేసి హాజరయ్యానని చంద్రబాబు తెలిపారు. తలసేమియా బాధితులకు తన సహాయం అందించడం తనకు గర్వకారణమని పేర్కొన్నారు. ఇందిరా గాంధీ మున్సిపల్ స్టేడియంలో జరిగిన ఈ భారీ ఈవెంట్‌కి నందమూరి, నారా కుటుంబ సభ్యులు హాజరై సందడి చేశారు. మ్యూజిక్ డైరెక్టర్ తమన్ ప్రదర్శనను ప్రేక్షకులు ఆస్వాదించారు. ఎన్టీఆర్ ట్రస్ట్ సేవా కార్యక్రమాలు మరింత విస్తరించాలని ఆకాంక్షించారు. తలసేమియా బాధితులకు సహాయంగా ప్రజలు కూడా ముందుకు రావాలని పిలుపునిచ్చారు.