CM Chandrababu brother Ramamurthy Naidu passed away

సీఎం చంద్రబాబు సోదరుడు రామ్మూర్తి నాయుడు కన్నుమూత

హైదరాబాద్‌: సీఎం చంద్రబాబు సోదరుడు రామ్మూర్తి నాయుడు కన్నుమూశారు. అనారోగ్యం బారిన పడిన ఆయన గతకొంతకాలంగా హైదరాబాద్ గచ్చిబౌలిలోని ఏఐజీ ఆసుపత్రిలో చికిత్స పొందారు. పరిస్థితి విషమించడంతో శనివారం ఉదయం తుదిశ్వాస విడిచారు. ఇప్పటికే అసెంబ్లీ సమావేశాలు సహా ఇతర కార్యక్రమాలన్నీ మంత్రి నారా లోకేష్ రద్దు చేసుకున్నారు. ఆసుపత్రికి సైతం చేరుకున్నారు. సీఎం చంద్రబాబు కూడా మహారాష్ట్ర పర్యటన రద్దు చేసుకొని హైదరాబాద్‌కు బయల్దేరారు.

1994 నుంచి 1999 వరకు చంద్రగిరి శాసనసభ నియోజకవర్గానికి తెలుగుదేశం పార్టీ తరపున రామ్మూర్తి నాయుడు ఎమ్మెల్యేగా పనిచేశారు. రామ్మూర్తి నాయుడు కొడుకు నారా రోహిత్ తెలుగు సినిమా నటుడు. రోహిత్ పలు హిట్ చిత్రాల్లో నటించిన విషయం తెలిసిందే. రామ్మూర్తి మరణవార్త తెలిసిన టీడీపీ శ్రేణులు సంతాపం ప్రకటిస్తున్నారు.

కాగా, వాస్తవానికి చంద్రబాబు ఈరోజు ఢిల్లీ నుంచి మహారాష్ట్రకు వెళ్లి… ఎన్డీయే తరపున ఎన్నికల ప్రచారంలో పాల్గొనాల్సి ఉంది. తమ్ముడి ఆరోగ్య పరిస్థితి విషమించిన నేపథ్యంలో ఆయన మహారాష్ట్ర ఎన్నికల ప్రచారాన్ని రద్దు చేసుకున్నారు. ఏపీ మంత్రి నారా లోకేశ్ ఇప్పటికే గన్నవరం విమానాశ్రయం నుంచి హైదరాబాద్ కు బయల్దేరారు. కాసేపట్లో ఆయన శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకోనున్నారు.

Related Posts
పాకిస్తాన్ రైలు హైజాక్: భద్రతా దళాల విజయవంతమైన ఆపరేషన్
పాకిస్తాన్ రైలు హైజాక్: భద్రతా దళాల విజయవంతమైన ఆపరేషన్

పాకిస్తాన్‌లో బలూచిస్తాన్ ప్రావిన్స్ నైరుతిలో ఉగ్రవాదులు జాఫర్ ఎక్స్‌ప్రెస్ రైలును హైజాక్ చేయడం కలకలం రేపింది. రైలులో ఉన్న 450 మందికి పైగా ప్రయాణికులను బందీలుగా పట్టుకోవడంతో, Read more

తెలంగాణ ఎమ్మెల్సీ ఎలక్షన్స్ బరిలో 90మంది
Telangana MLC nomo

మెదక్ నియోజకవర్గం కోసం 56 మంది అభ్యర్థులు పోటీ తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగిసింది తెలంగాణ రాష్ట్రంలో ఎమ్మెల్సీ ఎన్నికల నామినేషన్ల ఉపసంహరణ Read more

ప్రధాని మోదీ బ్రెజిల్‌లో G20 సదస్సులో పాల్గొనడానికి చేరుకున్నారు..
modi in brazil

భారత ప్రధాని నరేంద్ర మోదీ బ్రెజిల్‌లోని రియో డి జనీరోకు చేరుకున్నారు. ఈ రోజు, నవంబర్ 18, 2024, G20 సదస్సులో పాల్గొనడం కోసం మోదీ బ్రెజిల్ Read more

గుంటూరులో శ్రీ రెడ్డిపై కేసు నమోదు
srireddy

గత వైసీపీ ప్రభుత్వం అండ చూసుకొని కొంతమంది రెచ్చిపోయిన సంగతి తెలిసిందే. తమ స్థాయిని మరచిపోయి చంద్రబాబు , పవన్ కళ్యాణ్ , లోకేష్ ఇలా ఎవర్ని Read more