యోగాధ్యయన పరిషత్ పునరుద్ధరణ: సిఎం చంద్రబాబు
విజయవాడ : మెరుగైన వైద్య సేవలందించడమే కాదు, ప్రజలు వ్యాధుల బారిన పడకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకునేలా ప్రణాళికాబద్ధంగా వ్యవహరించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు సూచించారు. ఈ మేరకు ప్రజల ఆహారపు అలవాట్లు మొదలుకుని ఆర్గానిక్ ఉత్పత్తులు వినియోగించడం వరకు కార్యాచరణ అమలు చేయాలని చంద్రబాబు ఆదేశించారు. సచివాలయంలో వైద్యారోగ్య శాఖపై సీఎం చంద్రబాబు (CM Chandrababu) సమీక్ష నిర్వహించారు. వైద్యారోగ్య శాఖ పనితీరు.. టాటా డిజిటల్ నెర్వ్ సెంటర్ సేవలు, మెడికల్ కాలేజీల నిర్మాణం వంటి అంశాలపై సమీక్షలో చర్చించారు. సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ, భవిష్యత్తులో వైద్య ఖర్చులనేవి ప్రజలకు భరించలేని ఆర్థిక భారంగా మారే ప్రమాదం ఉందని, ఈ భారం తగ్గేలా చేయాలంటే ఆరోగ్యం మీద ప్రజల్లో విస్తృతంగా అవగాహన కల్పించడంతో పాటు, ఆహారపు అలవాట్లల్లో తీసుకురావాల్సిన మార్పుల పైనా ప్రజలకు వివరించాల్సిన అవసరం ఉంది. ప్రస్తుతం ఉన్న ఆహరపు అలవాట్లను కొనసాగిస్తే క్యాన్సర్ వంటి ప్రాణాంతక జబ్బులు వచ్చే ప్రమాదం ఉంది.

వ్యాధుల నియంత్రణ
పురుగు మందులు వినియోగించని ఈ ఉత్పత్తులను ఆహారంగా తీసుకోవాలి. ఈ దిశగా రైతులు, ప్రజలను చైతన్యం చేయాలి. ఈ మేరకు ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేయాలి. అని అన్నారు. అప్రమత్తత, ముందు జాగ్రత్త చర్యలతో అందరికీ ఆరోగ్యం అని సిఎం చంద్రబాబు అన్నారు. తగు జాగ్రత్తలతో వ్యాధుల నియంత్రణ చేపట్టాలని అన్నారు. ప్రజలపై వైద్య ఖర్చుల భారం తగ్గాలంటే ఆరోగ్య పరిరక్షణ అవగాహన పెరగాల్సిన అవసరం ఉందని సిఎం అన్నారు. టాటా ట్రస్ట్ గేట్స్ ఫౌండేషన్ భాగస్వామ్యంతో చేపడుతున్న డిజిటల్ నెర్వ్ సెంటర్లు (Digital nerve centers) ప్రజారోగ్యంపై ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తాయి. ఇప్పటికే కుప్పంలో పైలెట్ ప్రాజెక్టుగా టాటా డిజిటల్ నెర్వ్ సెంటరును ప్రారంభించాం. వచ్చే ఏడాది జనవరిలో చిత్తూరు జిల్లా వ్యాప్తంగా టాటా డిజిటల్ నెర్వ్ సెంటర్లను ప్రారంభించబోతున్నాం.. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా వచ్చే ఏడాది చివరికి ప్రారంభించబోతున్నాం. దీని కోసం జిల్లా స్థాయి, రాష్ట్ర స్థాయిలో కమాండ్ కంట్రోల్ సెంటర్లు ఏర్పాటు చేసుకోవాలి. ఈ సెంటర్లను సమర్థవంతంగా నడపగలిగితే, పేదలకు మెరుగైన వైద్య సేవలు (Medical services) అందించవచ్చు. తక్కువ ఖర్చులో ఎక్కువ వైద్య సేవలు అందించే ఉద్దేశం తో డిజిటల్ నెర్వ్ సెంటర్లు పని చేస్తున్నాయి.
చంద్రబాబు నాయుడు రాజకీయ జీవితాన్ని ఎప్పుడు ప్రారంభించారు?
చంద్రబాబు నాయుడు 1978లో కాంగ్రెస్ పార్టీ ద్వారా తన రాజకీయ జీవితాన్ని ప్రారంభించారు. తరువాత ఆయన 1983లో తెలుగుదేశం పార్టీలో చేరారు.
చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్‌కు ముఖ్యమంత్రిగా ఎన్ని సార్లు పనిచేశారు?
చంద్రబాబు నాయుడు మూడుసార్లు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా పనిచేశారు — 1995 నుండి 2004 వరకు, 2014 నుండి 2019 వరకు,2024లో మళ్లీ ఎన్నికయ్యారు.
Read hindi news: hindi.vaartha.com
Read Also: Minister Ramprasad: ఆధునిక సాంకేతికతతో రవాణా శాఖను మరింత బలోపేతం చేస్తాం: మంత్రి రాంప్రసాద్