పీఎఫ్ (PF) ఖాతాదారులకు శుభవార్త. జూన్ నెల (June)నుంచి EPFO 3.0 సేవలు ప్రారంభం కానున్నాయి. ఈపీఎఫ్ సేవల్లో ఇది ఒక పెద్ద మార్పు కానుంది. డిజిటల్ యుగానికి తగ్గట్లుగా కొత్త ఫీచర్లను పరిచయం చేస్తున్నారు.ఈసారి ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO) వినూత్న విధానాలతో ముందుకు వస్తోంది. ఖాతాదారుల అనుభవం మెరుగుపడేలా పలు కొత్త ఫీచర్లు అందుబాటులోకి వస్తున్నాయి.EPFO 3.0లో ప్రధాన ఫీచర్ ఏటీఎం ద్వారా విత్‌డ్రా సదుపాయం. క్లెయిమ్ సెటిల్‌మెంట్ తర్వాత నేరుగా ఏటీఎంలో నుంచి డబ్బు తీసుకోవచ్చు. ఇది పూర్తిగా డిజిటల్ ప్రాసెస్ అవుతుంది. బ్యాంక్ అకౌంట్లో డబ్బు వేగంగా చేరుతుంది.ఇంకో ముఖ్యమైన ఫీచర్ ఆటో క్లెయిమ్ సెటిల్‌మెంట్. దీని వల్ల ప్రాసెసింగ్ టైం బాగా తగ్గుతుంది. మానవ జోక్యం లేకుండా క్లెయిమ్స్ త్వరగా పరిష్కారమవుతాయి. ఖాతాదారులకు ఇది పెద్ద సౌలభ్యం.
డిజిటల్ అకౌంట్ అప్‌డేట్ సదుపాయం
ఇకపై పేరు, పుట్టిన తేది మార్పులకు ఫారాలు అవసరం లేదు. ఖాతాదారులు డిజిటల్‌గా వివరాలను సరిచేసుకోవచ్చు. పేరు తప్పులేనా? పుట్టిన తేది పొరపాటా? ఇప్పుడు ఆన్‌లైన్‌లోనే మార్చొచ్చు.
గ్రీవియెన్స్ సిస్టమ్ మరింత వేగవంతం
ఖాతాదారుల ఫిర్యాదులు త్వరగా పరిష్కారం కానున్నాయి. కొత్త వెర్షన్‌లో గ్రీవియెన్స్ రెడ్రెసల్ సిస్టమ్ పూర్తిగా అప్‌డేట్ అవుతుంది. సమస్యను సులభంగా ఫైల్ చేయవచ్చు. పరిష్కారమూ వేగంగా పొందవచ్చు.EPFOను మరింత సమగ్రంగా చేయాలనే దిశగా చర్యలు జరుగుతున్నాయి. ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం నడుపుతున్న పథకాలను ఇందులో అనుసంధానించేందుకు ప్రయత్నం చేస్తున్నారు. అందులో:అటల్ పెన్షన్ యోజన,ప్రధాన్ మంత్రి జీవన్ బీమా యోజన
శ్రామిక్ జనధన్ యోజన
ఈ పథకాలను EPFOతో కలపాలని యోచిస్తున్నారు. సోషల్ సెక్యూరిటీ వ్యవస్థ మరింత బలపడుతుంది. ఆరోగ్య సేవలు కూడా ఇందులో భాగం కానున్నాయి.
ఇప్పటివరకు పెన్షన్ క్లెయిమ్స్, అకౌంట్ మార్పులన్నీ బాగా సమయపట్టేవి. ఇప్పుడు ఇవన్నీ డిజిటల్ ఫాస్ట్ ట్రాక్‌లోకి వస్తున్నాయి. ఖాతాదారులకు అవసరమైన సేవలు వేగంగా అందనున్నాయి. ఇది సిస్టమ్‌ను పూర్తిగా మార్చే మార్గం.
Read Also : AICC : ఏఐసీసీ ఇన్‌చార్జ్ మీనాక్షితో కార్పొరేషన్ చైర్మన్ల కీలక భేటీ..