AP inter class

ఏపీలో ఇంటర్ విద్యార్థులకు సా.5 వరకు తరగతులు

రాష్ట్ర ప్రభుత్వ, అనుబంధ ఇంటర్ కాలేజీల్లో నేటి నుంచి ఒక గంట అదనంగా క్లాసులు నిర్వహించాలని విద్యాశాఖ ఆదేశాలు జారీ చేసింది. ప్ర‌స్తుతం ఇంట‌ర్మీడియట్ కాలేజీలు ఉద‌యం 9 గంట‌ల నుంచి సాయంత్రం 4 గంట‌ల వ‌ర‌కు నిర్వ‌హిస్తున్నారు. ఈ టైమింగ్‌ను రాష్ట్ర ప్ర‌భుత్వం స‌వ‌రించింది. తాజా నిర్ణయం ప్రకారం.. ఉద‌యం 9 గంట‌ల నుండి సాయంత్రం 5 గంట‌ల వ‌ర‌కు టైమింగ్స్‌ను పొడిగించారు. ఈ క్రమంలో విద్యార్థులను పరీక్షలకు ప్రిపేర్ చేసేందుకు అదనపు సమయంలో ప్రత్యేక తరగతులు నిర్వహించనున్నారు.

విద్యార్థులు సరిగా రాణించ‌క‌పోవ‌డంతోనే గంటసేపు టైమింగ్స్ పెంచామ‌ని.. ఆ గంట‌సేపు విద్యార్థులు కాలేజీల్లోనే చ‌దువుకుంటార‌ని తెలిపారు. ఇక నుంచి సాయంత్రం 4 గంట‌ల నుండి 5 గంట‌ల వ‌ర‌కు కాలేజీల్లో స్ట‌డీ అవ‌ర్స్ నిర్వ‌హించాల‌ని డైరెక్ట్ కృతిక శుక్లా ఉత్త‌ర్వుల్లో పేర్కొన్నారు. ఈ మేర‌కు టైమ్ టేబుల్స్‌ను సిద్ధం చేయాల‌ని అన్ని ప్ర‌భుత్వ, ఎయిడెడ్ ఇంట‌ర్మీడియట్ కాలేజీ ప్రిన్సిప‌ల్స్‌కు ఆదేశించారు. రాష్ట్రంలోని అన్ని ప్ర‌భుత్వ‌, ఎయిడెడ్ జూనియ‌ర్ కాలేజీల్లో చ‌దువుతున్న విద్యార్థుల‌కు ప్రైవేట్ స్కూళ్లలో ఇచ్చిన‌ట్లే ప్రోగ్రెస్ కార్డులు ఇవ్వాల‌ని కృతిక శుక్లా ఆదేశించారు. ఆ కార్డు న‌మూనాను కాలేజీలకు పంపించారు. వృత్తి విద్యా కోర్సుల విద్యార్థుల‌కు తెల్లరంగు, జ‌న‌ర‌ల్ విద్యార్థుల‌కు ఫస్టియర్‌ విద్యార్థులకు వారికి లేత ప‌సుపు రంగు, సెకండియర్‌ విద్యార్థులకు నీలం రంగు కార్డుల‌ను ముద్రించి ఇవ్వాల‌ని సూచించారు.

Related Posts
ఉక్రెయిన్ పై రష్యా క్షిపణి దాడి
ukraine russia

శుక్రవారం తెల్లవారుజామున రష్యా క్షిపణి దాడి కీవ్ నగరాన్ని దెబ్బతీసింది. ఈ దాడికి ప్రతిస్పందించిన వాయు రక్షణ వ్యవస్థ వలన కొంతవరకు క్షిపణి దాడిని అడ్డగించేందుకు ప్రయత్నం Read more

మళ్లీ వార్తల్లోకి వచ్చిన ముద్రగడ
mudragada

కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం మరోసారి వార్తల్లో నిలిచాడు. అప్పట్లో ఎన్నికల సమయంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ను టార్గెట్ చేస్తూ వార్తల్లో నిలిచినా Read more

మన్మోహన్‌ సింగ్‌ ఓ గొప్ప రాజనీతిజ్ఞుడు : జో బైడెన్‌
Joe Biden mourns the death of Manmohan Singh

న్యూయార్క్‌: అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌, మాజీ ప్రధాని డాక్టర్‌ మన్మోహన్‌ సింగ్‌ మృతి పట్ల సంతాపం వ్యక్తం చేశారు. ఆయన ‘నిజమైన రాజనీతిజ్ఞుడు’, ‘గొప్ప ప్రజా Read more

భారతీయులకు జో బైడెన్ శుభవార్త
visa

ట్రంప్ ఎన్నికలో గెలిచి, జనవరిలో కొత్త అధ్యక్షుడిగా ప్రమాణం చేయనున్న తరుణంలో వీసాల విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో అని ఆందోనళ చెందే వారికీ జో బైడెన్ Read more

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *