సివిల్ సర్వీసెస్‌పై ఉచిత శిక్షణ పొందాలనుకుంటున్న విద్యార్థులకు ఓయూ ఆధ్వర్యంలోని అకాడమీ గుడ్ న్యూస్ చెప్పింది. తాజాగా విడుదల చేసిన నోటిఫికేషన్‌లో, ఉస్మానియా యూనివర్సిటీ (Osmania University) (ఓయూ)కి చెందిన విద్యార్థులతోపాటు ఆ యూనివర్సిటీ అనుబంధ కాలేజీల విద్యార్థులకే ఈ శిక్షణ అవకాశం అందుబాటులో ఉంటుందని స్పష్టంగా పేర్కొన్నారు.ఈ అవకాశాన్ని అన్ని వర్సిటీ విద్యార్థులకు (For university students) కల్పిస్తారని ఆశించిన యువతకు నిరాశే ఎదురైంది. రాష్ట్ర ప్రభుత్వం, ఓయూ అధికారులు సంయుక్తంగా తీసుకున్న ఈ నిర్ణయం పట్ల విద్యార్థులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఇతర వర్సిటీ విద్యార్థులను పక్కనపెట్టి, కేవలం ఓయూ పరిధిలో ఉన్నవారికి మాత్రమే ఈ సదుపాయం కల్పించడం ఎందుకని ప్రశ్నిస్తున్నారు.
విద్యార్థుల్లో అసంతృప్తి, ప్రభుత్వం స్పందించాలంటూ డిమాండ్
ఈ అవకాశం ప్రతి విద్యార్థికి సమానంగా ఉండాలని పలువురు అభిప్రాయపడుతున్నారు. సివిల్ సర్వీసెస్ వంటి పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులందరికీ ఉచిత శిక్షణ అందించాల్సిన అవసరం ఉందని వారు అంటున్నారు. సామాజిక, ఆర్థికంగా వెనుకబడిన విద్యార్థులకు ఈ శిక్షణ ఎంతో అవసరమని, ఓయూ పరిధిలో ఉండని వారు ఎందుకు వంచితులవుతారో అర్థం కావడంలేదంటున్నారు.
దరఖాస్తుల గడువు నెలాఖరు వరకు
అకాడమీ విడుదల చేసిన నోటిఫికేషన్ ప్రకారం, ఈ శిక్షణ కోర్సుకు దరఖాస్తు చేసుకునే చివరి తేది ఈ నెలాఖరు వరకు ఉన్నట్లు స్పష్టం చేశారు. అర్హత కలిగిన విద్యార్థులు త్వరగా అప్లై చేసుకోవాలని అధికారులు సూచించారు.
Read Also : Telangana : తెలంగాణ లో ఓటు హక్కు ఉన్న 30 వేల మంది పేర్లు తొలగింపు : ఎందుకంటే?