సంక్రాంతి పండగ సీజన్ మూవీ ప్రియులకు ఒక ఆహ్లాదకరమైన సమయం కానుంది, ఎందుకంటే పలు సినిమాలు థియేటర్లలో విడుదలై ప్రేక్షకుల మనస్సులు గెలుస్తున్నాయి.గేమ్ చెంజర్, డాకు మహారాజ్, మరియు సంక్రాంతి వస్తున్నాం వంటి సినిమాలు పాజిటివ్ రెస్పాన్స్‌తో దూసుకుపోతున్నాయి.అయితే, ఇంకా అనేక సినిమాలు ప్రేక్షకుల ముందుకు రానున్నాయి, వాటి మేకర్స్ తమ అప్డేట్స్‌ను పంచుకున్నారు. మరి ఈ సినిమాలు ఏంటి? ఎప్పుడు రానున్నాయి? చూద్దాం.ప్రభాస్, మారుతి కాంబోలో తెరకెక్కుతున్న ది రాజాసాబ్ సినిమా ఏప్రిల్ 10న విడుదల కాబోతోంది.

పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న పీరియాడిక్ యాక్షన్ చిత్రం హరిహర వీరమల్లు కూడా ప్రేక్షకులను అలరించడానికి సిద్ధంగా ఉంది.ఈ సినిమాలో నిధి అగర్వాల్ పవన్ సరసన నటిస్తుంది.సంక్రాంతి పండగ సందర్భంగా ఈ చిత్రంలో “మాట వినాలి” అనే సాంగ్ ప్రోమో విడుదలైంది. ఈ పాటను స్వయంగా పవన్ కళ్యాణ్ ఆలపించడం విశేషం.ఈ పాట ఫుల్ వర్షన్ జనవరి 17న ఉదయం 10:20కి విడుదల కానుంది.

హుంబాలే ఫిలిమ్స్ నిర్మిస్తున్న ఇండియన్ ఎపిక్ యానిమేటెడ్ డ్రామా మహావతార్ నరసింహ సినిమా సంక్రాంతి సందర్బంగా టీజర్ విడుదల చేసింది. ఈ సినిమాపై మంచి క్రేజ్ ఏర్పడింది.ఈ సినిమా ఏప్రిల్ 3న థియేటర్లలో విడుదల కానుంది.రజినీకాంత్, Nelson Dilip Kumar కాంబోలో వచ్చిన జైలర్ సినిమాకు సీక్వెల్ కూడా రానున్నది.ఈ సీక్వెల్ సంక్రాంతి రోజున అధికారికంగా ప్రకటించారు, దీని కోసం ఓ వీడియో కూడా విడుదల చేశారు. విశ్వక్ సేన్ ప్రధాన పాత్రలో నటిస్తున్న లైలా సినిమా ఫిబ్రవరి 14న ప్రేక్షకులను అలరించనుంది. ఈ సినిమాలో తొలిసారి లేడీ గెటప్‌లో కనిపించనున్న మాస్ కా దాస్, ఫ్యాన్స్ ను ఆకట్టుకుంది.