हिन्दी | Epaper
ఏవీఏం స్టూడియో అధినేత కన్నుమూత చిన్న బడ్జెట్, భారీ లాభం సంక్రాంతి బాక్సాఫీస్ బ్లాక్‌బస్టర్స్ ఈ వారం వైల్డ్ ఫైర్ నామినేషన్స్ స్టేజ్ మీద ముద్ద మందారం 2 సీరియల్ సందడి ‘ఆదిత్య 999’ బాలకృష్ణ క్రేజీ అప్‌డేట్ సౌత్ సినిమాలకు నెట్‌ఫ్లిక్స్ గట్టి షాక్ ‘రాజు వెడ్స్ రాంబాయి’ టికెట్ ధర..₹99 మాత్రమే! సినిమాలకి తులసి గుడ్ బై 71వ ఎపిసోడ్‌లో వాడి వేడి నామినేషన్ లు ఏవీఏం స్టూడియో అధినేత కన్నుమూత చిన్న బడ్జెట్, భారీ లాభం సంక్రాంతి బాక్సాఫీస్ బ్లాక్‌బస్టర్స్ ఈ వారం వైల్డ్ ఫైర్ నామినేషన్స్ స్టేజ్ మీద ముద్ద మందారం 2 సీరియల్ సందడి ‘ఆదిత్య 999’ బాలకృష్ణ క్రేజీ అప్‌డేట్ సౌత్ సినిమాలకు నెట్‌ఫ్లిక్స్ గట్టి షాక్ ‘రాజు వెడ్స్ రాంబాయి’ టికెట్ ధర..₹99 మాత్రమే! సినిమాలకి తులసి గుడ్ బై 71వ ఎపిసోడ్‌లో వాడి వేడి నామినేషన్ లు ఏవీఏం స్టూడియో అధినేత కన్నుమూత చిన్న బడ్జెట్, భారీ లాభం సంక్రాంతి బాక్సాఫీస్ బ్లాక్‌బస్టర్స్ ఈ వారం వైల్డ్ ఫైర్ నామినేషన్స్ స్టేజ్ మీద ముద్ద మందారం 2 సీరియల్ సందడి ‘ఆదిత్య 999’ బాలకృష్ణ క్రేజీ అప్‌డేట్ సౌత్ సినిమాలకు నెట్‌ఫ్లిక్స్ గట్టి షాక్ ‘రాజు వెడ్స్ రాంబాయి’ టికెట్ ధర..₹99 మాత్రమే! సినిమాలకి తులసి గుడ్ బై 71వ ఎపిసోడ్‌లో వాడి వేడి నామినేషన్ లు ఏవీఏం స్టూడియో అధినేత కన్నుమూత చిన్న బడ్జెట్, భారీ లాభం సంక్రాంతి బాక్సాఫీస్ బ్లాక్‌బస్టర్స్ ఈ వారం వైల్డ్ ఫైర్ నామినేషన్స్ స్టేజ్ మీద ముద్ద మందారం 2 సీరియల్ సందడి ‘ఆదిత్య 999’ బాలకృష్ణ క్రేజీ అప్‌డేట్ సౌత్ సినిమాలకు నెట్‌ఫ్లిక్స్ గట్టి షాక్ ‘రాజు వెడ్స్ రాంబాయి’ టికెట్ ధర..₹99 మాత్రమే! సినిమాలకి తులసి గుడ్ బై 71వ ఎపిసోడ్‌లో వాడి వేడి నామినేషన్ లు

దుమ్మురేపుతున్న బాలయ్య సినిమా ట్రైలర్..

Divya Vani M
దుమ్మురేపుతున్న బాలయ్య సినిమా ట్రైలర్..

నందమూరి బాలకృష్ణ హీరోగా నటించిన డాకు మహారాజ్‌ చిత్రం ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ అమెరికాలోని డాలస్‌లో గ్రాండ్‌గా జరిగింది. టెక్సాస్ ట్రస్ట్ థియేటర్ వేదికగా జరిగిన ఈ వేడుకలో థియేట్రికల్ ట్రైలర్‌ను విడుదల చేయడం జరిగింది. ఈ వేడుకకు నందమూరి అభిమానులు పెద్ద సంఖ్యలో హాజరై “జై బాలయ్య” నినాదాలతో ప్రాంగణాన్ని హోరెత్తించారు. డాకు మహారాజ్‌ చిత్రానికి బాబీ (కె.ఎస్‌.రవీంద్ర) దర్శకత్వం వహించగా, ఈ యాక్షన్ డ్రామాలో బాలకృష్ణకు జోడీగా ప్రగ్యా జైస్వాల్, ఊర్వశీ రౌతేలా నటించారు. వీరితో పాటు శ్రద్ధా శ్రీనాథ్, చాందిని చౌదరి కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఈ సినిమా ట్రైలర్ యాక్షన్‌, ఎమోషన్‌, డ్రామాతో సమపాళ్లలో ఉండి ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఉంది.

daaku maharaaj
daaku maharaaj

“కింగ్ ఆఫ్ జంగిల్” అంటూ బాలయ్యకు ఇచ్చిన ఎలివేషన్స్ అభిమానులను అమితంగా రంజింపజేశాయి. ప్రతినాయకుడిగా బాబీ డియోల్ పాత్ర మరింత ఆసక్తి పెంచుతూ ట్రైలర్‌ హైలైట్‌గా నిలిచింది. డాకు మహారాజ్‌ ట్రైలర్‌ మాస్ మరియు క్లాస్‌ ప్రేక్షకుల్ని సమానంగా ఆకట్టుకునేలా రూపొందించబడింది. మూడు విభిన్న లుక్స్‌లో బాలయ్య కనిపించనుండటం ఈ సినిమా మీద ఉన్న అంచనాలను రెట్టింపు చేసింది. తమన్‌ అందించిన బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్‌ థ్రిల్లింగ్‌ ఎలిమెంట్స్‌కి జోడీగా నిలిచింది. “సంక్రాంతి విన్నర్ బాలయ్యే” అంటూ దర్శకుడు బాబీ ధీమాగా చెప్పడం, “ఇంతకు ముందు ఎప్పుడూ చూడని బాలయ్యను చూస్తారు” అని నిర్మాత నాగవంశీ ప్రకటించడం ఈ సినిమాపై మరింత ఆసక్తిని పెంచింది.

డాకు మహారాజ్‌ సినిమా హై ఓల్టేజ్ యాక్షన్ సీక్వెన్స్‌లు, భావోద్వేగ భరితమైన కథనంతో నందమూరి అభిమానులకే కాదు, సర్వత్రా ప్రేక్షకులకు దృశ్యవిందంగా నిలవబోతోంది. బాబీ డైరెక్షన్‌లో బాలయ్య నటన, తమన్‌ సంగీతం కలగలిసి సినిమా స్థాయిని మరింత పెంచాయి. సంక్రాంతి పండగ సందర్భంగా జనవరి 12, 2025న ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రం విడుదల కానుంది. శ్రీకర స్టూడియోస్ సమర్పణలో ఫార్చూన్‌ ఫోర్‌ సినిమాతో కలిసి సితార ఎంటర్‌టైన్మెంట్స్ ఈ చిత్రాన్ని నిర్మించింది.

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870