అక్కినేని నాగేశ్వరరావు (ఏఎన్నార్) జీవితాన్ని బయోపిక్‌గా తీసుకురావడం గురించి ప్రశ్నిస్తే, ఆయన కుమారుడు నాగార్జున ఎప్పుడూ ఒకేలా స్పందిస్తారు. “నాన్నగారి జీవితం విజయాల పర్యాయపదం. ఒక జీవిత కథ సినిమాగా జనాన్ని ఆకట్టుకోవాలంటే, అందులో గెలుపోటములు, వివాదాలు, భావోద్వేగాలతో నిండిన ఘర్షణలు ఉండాలి. కానీ నాన్నగారి ప్రయాణం ఎప్పుడూ హాయిగా, విజయవంతంగా సాగింది. అలాంటి జీవితం తెరపైకి తీసుకువస్తే బోరింగ్‌గా అనిపించవచ్చు,” అని ఇటీవల గోవాలో జరిగిన అంతర్జాతీయ ఫిల్మ్ ఫెస్టివల్ సందర్భంగా నాగార్జున తెలిపారు.ఆయన అభిప్రాయంలో, ఏఎన్నార్ జీవితం ఎప్పుడూ ఉన్నతస్థాయిలో కొనసాగింది. ఎలాంటి వివాదాలు లేకుండా నడిచిన ఈ విజయప్రస్థానంలో కఠినతరమైన మలుపులు లేకపోవడం వల్ల, ప్రేక్షకులను మెప్పించే ఎమోషనల్ డిఫ్త్ ఉండదని ఆయన భావిస్తున్నారు. “ఎత్తులు, పల్లాలు లేని జీవితాన్ని సినిమాగా తీశామంటే, అది జనాలకు కనెక్ట్ కాదు,” అని స్పష్టం చేశారు నాగ్.ఈ సందర్భంగా నాగార్జున అన్నపూర్ణ స్టూడియోలో నెలకొల్పిన ఆధునిక సౌకర్యాల గురించి ప్రస్తావించారు. “ఇప్పుడు మా స్టూడియోలో డాల్బీ ఫెసిలిటీ ఉంది.
గతంలో రాజమౌళి వంటి దర్శకులు ఇటువంటి టెక్నాలజీ కోసం విదేశాలకు వెళ్లేవారు. ఇకపై అలాంటి అవసరాలు ఉండవు,” అని చెప్పారు.ఇప్పటి తరం దర్శకుల్లో లోకేష్ కనగరాజ్ అత్యుత్తముల్లో ఒకరని నాగార్జున అభిప్రాయపడ్డారు ఆయనతో కలిసి పనిచేయడం గొప్ప అనుభవంగా ఉందన్నారు. దేవదాస్ లేదా ప్రేమ్ నగర్ లాంటి క్లాసిక్ సినిమాలను రీమేక్ చేస్తారా అని ప్రశ్నించగా, “చేతులు కాల్చుకోవడానికా వాటిని మళ్లీ తీయడం?” అని నవ్వుతూ సమాధానమిచ్చారు. అలాగే, నాగ చైతన్య వివాహం ప్రణాళికలో ఉందని పేర్కొన్నారు. “వెడ్డింగ్ పనులు జరుగుతున్నాయి,” అని స్పష్టంచేశారు. ప్రస్తుతం నాగార్జున బిగ్ బాస్ తెలుగు తో బిజీగా ఉన్నారు. అలాగే, లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో వచ్చిన లియో లో కీలక పాత్ర పోషించారు.మరోవైపు, ఆయన కుబేర చిత్రంలో కూడా నటిస్తున్నారు. కానీ బంగార్రాజు తర్వాత ఆయన నుండి కొత్త సినిమా రాలేదు, ఇది అభిమానులను నిరుత్సాహపరుస్తోంది. తాజాగా, నాగార్జున వివాదాలు, కోర్టు కేసుల కారణంగా వార్తల్లో నిలుస్తున్నారు. అయినప్పటికీ, పర్సనల్ అండ్ ప్రొఫెషనల్ లైఫ్‌ని బ్యాలెన్స్ చేస్తూ ముందుకుసాగుతున్నారు.