With Love Movie: థియేటర్లలో చిన్న సినిమాగా విడుదలై పెద్ద విజయాన్ని అందుకున్న రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ ‘విత్ లవ్’ ఇప్పుడు ఓటీటీ ప్రేక్షకులను పలకరించేందుకు వచ్చేసింది. యువ నటులు అభిషన్ జీవింత్, అనస్వర రాజన్ జంటగా నటించిన ఈ చిత్రం ఫిబ్రవరి 6న థియేటర్లలో విడుదలై విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ప్రముఖ ఓటీటీ దిగ్గజం నెట్‌ఫ్లిక్స్ (Netflix) ఈ సినిమా డిజిటల్ హక్కులను సొంతం చేసుకోగా, నేటి నుంచి (మార్చి 6) స్ట్రీమింగ్ ప్రారంభమైంది.
Read Also: Mrithyunjay Movie Review: శ్రీవిష్ణు థ్రిల్లర్ మెప్పించిందా?
బాక్సాఫీస్ వద్ద సర్ప్రైజ్ హిట్.. రూ. 10 కోట్ల క్లబ్‌లో!
ప్రేక్షకుల హృదయాలను హత్తుకునే కథాంశంతో తెరకెక్కిన ‘విత్ లవ్’ బాక్సాఫీస్ వద్ద అనూహ్య విజయాన్ని నమోదు చేసింది. ఎటువంటి అంచనాలు లేకుండా విడుదలైన ఈ చిత్రం కేవలం ఐదు రోజుల్లోనే రూ. 10 కోట్ల వసూళ్లను రాబట్టి ట్రేడ్ వర్గాలను ఆశ్చర్యపరిచింది. యువతను విశేషంగా ఆకర్షించిన ఈ రొమాంటిక్ డ్రామా, థియేటర్లలో మిస్ అయిన వారికి ఇప్పుడు ఇంట్లోనే కూర్చుని చూసే అవకాశం దక్కింది. తెలుగు మాత్రమే కాకుండా తమిళం, హిందీ, మలయాళం, కన్నడ భాషల్లో కూడా ప్రేక్షకులకు అందుబాటులోకి వచ్చింది.

Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: