ప్రభాస్ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రం స్పిరిట్, సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో భారీ యాక్షన్ డ్రామాగా రూపొందుతోంది. ఈ చిత్రంలో ప్రభాస్‌ను తొలిసారి పోలీస్ యూనిఫామ్‌లో చూపించనున్నారు. అయితే, ‘స్పిరిట్’ (Spirit Movie) గురించి ఒక ఆసక్తికరమైన వార్త ప్రస్తుతం టాలీవుడ్‌లో చర్చనీయాంశమైంది. ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ఇటీవల మొదలవ్వగా, దర్శకుడు సందీప్ వంగా ప్రభాస్ లుక్ విషయంలో అత్యంత గోప్యత పాటిస్తున్నట్లు తెలుస్తోంది.
Read Also: Rajinikanth: ఎన్నిజన్మలెత్తినా రజినీకాంత్‌గానే పుడతా

రాబోయే ఆరు నెలల పాటు ప్రభాస్ పబ్లిక్ ఈవెంట్స్‌కు దూరంగా ఉండాలి
తాజా సమాచారం ప్రకారం ‘స్పిరిట్’ సినిమా (Spirit Movie) లోని ప్రభాస్ పాత్ర లుక్‌ను అభిమానులకు సర్‌ప్రైజ్‌గా ఉంచాలని సందీప్ వంగా గట్టిగా నిర్ణయించుకున్నారు. అందుకే, ఈ లుక్ లీక్ అవ్వకుండా ఉండేందుకు, రాబోయే ఆరు నెలల పాటు ప్రభాస్ (Prabhas) ని పబ్లిక్ ఈవెంట్స్‌కు దూరంగా ఉండాలని ఆయన కోరినట్లు సమాచారం.పబ్లిక్ ఈవెంట్లు, ఎయిర్‌పోర్ట్‌లలో ప్రభాస్ కనిపిస్తే, ఆయన లుక్‌ను అభిమానులు లేదా మీడియా ఫొటోలు తీసే అవకాశం ఉంది.
ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకుని, కొన్ని నెలల పాటు ఎలాంటి ప్రచార కార్యకలాపాలు లేదా బహిరంగ కార్యక్రమాలకు హాజరు కాకూడదని ప్రభాస్, సందీప్ వంగా నిర్ణయించుకున్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఈ నిర్ణయం ప్రభాస్ అభిమానులను కొంత నిరాశపరిచినా సందీప్ వంగా ప్రభాస్‌ను ఏ విధంగా ప్రెజెంట్ చేయబోతున్నారో చూడాలనే ఉత్సాహం మాత్రం ఫ్యాన్స్ లో ఎక్కువగా ఉంది.
Read hindi news:hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com/
Read Also: