టాలీవుడ్ ట్యాలెంటెడ్ యాక్టర్ ప్రియదర్శి పులికొండ హీరోగా నటించిన లేటెస్ట్ సినిమా ప్రేమంటే. (Premante Movie) నవనీత్ శ్రీరామ్ తెరకెక్కించిన ఈ రొమాంటిక్ లవ్ స్టోరీలో, ఆనంది హీరోయిన్ గా నటించింది. అలాగే స్టార్ యాంకర్ సుమ కనకాల, వెన్నెల కిశోర్, హైపర్ ఆది, అభయ్ బేతిగంటి, సురభి ప్రభావతి తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు. రానా స్పిరిట్ మీడియా సమర్పణలో పుస్కూర్ రామ్మోహన్ రావు, జాన్వీ నారంగ్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మించారు.
Read Also: Naresh Agastya: ‘గుర్రం పాపిరెడ్డి’ ట్రైలర్ విడుదల
ఈ నెల 19న ప్రీమియర్ కానుంది
నవంబర్ 21న థియేటర్లలోకి వచ్చిన ప్రేమంటే (Premante Movie) సినిమా ఓ మోస్తరుగా ఆడింది. బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లనే రాబట్టింది.ఇక ఓటీటీలో తన లక్‌ను పరీక్షించుకునేందుకు రెడీ అయింది. పాపులర్ ఓటీటీ ప్లాట్‌ఫాం నెట్‌ఫ్లిక్స్ (Netflix) స్ట్రీమింగ్ డేట్‌ను ప్రకటించింది. ఈ మూవీ నెట్‌ఫ్లిక్స్‌లో 2025 ఈ నెల 19న ప్రీమియర్ కానుంది. తెలుగు వెర్షన్‌తోపాటు తమిళం, కన్నడ, మలయాళ డబ్బింగ్ వెర్షన్లు కూడా అందుబాటులో ఉన్నాయి. మరి ఓటీటీలో ఎలాంటి స్పందన రాబట్టుకుంటుందని ఆసక్తికరంగా మారింది.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also: