దుల్కర్ సల్మాన్ ప్రధాన పాత్రలో నటించిన లేటెస్ట్ పీరియాడికల్ సినిమా ‘కాంత’ (Kantha Movie), సెల్వమణి సెల్వరాజ్ తెరకెక్కించిన ఈ పీరియాడికల్ మూవీలో భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్ గా యాక్ట్ చేసింది. అలాగే సముద్రఖని, దగ్గుబాటి రానా తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు. ఓటీటీలోకి వచ్చేస్తోంది. గత నెల 14న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ (Kantha Movie) మూవీ బాక్సాఫీస్ వద్ద మిక్స్‌డ్ టాక్ సొంతం చేసుకుంది. ఓటీటీ రిలీజ్‌పై పలు రూమర్స్ వచ్చినా వాటన్నింటికీ తాజాగా చెక్ పడింది.
Read Also: Dileep: లైంగిక వేధింపుల కేసు.. నటుడు దిలీప్ కు కోర్టు లో ఊరట
నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్
ఈ సినిమాను ఓటీటీ రైట్స్ ను నెట్‌ఫ్లిక్స్ సంస్థ సొంతం చేసుకుంది. ఈ నెల 12 నుంచి నెట్‌ఫ్లిక్స్ (Netflix) లో, స్ట్రీమింగ్ కానుంది. తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళ భాషల్లో ఈ మూవీ అందుబాటులో ఉండనుంది.ఇక ఈ సినిమా ఓటీటీలో ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి.
అయ్య (సముద్రఖని) ఫేమస్ డైరెక్టర్. తన తల్లి జీవిత కథ ఆధారంగా ‘శాంత’ అనే సినిమా తీయాలనుకుంటాడు. తన ప్రియ శిష్యుడు టీకే మహాదేవన్ (దుల్కర్ సల్మాన్) ను అందులో హీరో. ప్రేక్షకులు దేవుడిగా మహాదేవన్‌ను కొలుస్తూ ‘నట చక్రవర్తి’ అనే బిరుదు ఇస్తారు. అయితే, అయ్యకు, మహాదేవన్‌కు మధ్య ఊహించని విధంగా శత్రుత్వం ఏర్పడుతుంది. ఇద్దరి మధ్య పచ్చగడ్డి వేస్తేనే భగ్గుమంటుంది.

దీంతో ‘శాంత’ సినిమా మధ్యలోనే ఆగిపోతుంది.కొన్నేళ్ల తర్వాత సినిమా మళ్లీ ప్రారంభమైనా తాను చెప్పిన క్లైమాక్స్‌తోనే మూవీ తీయాలనే కండీషన్ మీద చేయడానికి ఒప్పుకొంటాడు మహాదేవన్. టైటిల్ ‘శాంత’ నుంచి ‘కాంత’కు మార్చేస్తాడు. ఎన్ని మార్పులు చేసినా ఎన్ని కండీషన్స్ పెట్టినా తన తల్లి కథను వెండితెరపై చూడాలనే కోరికతో అయ్య..అన్నింటికీ అంగీకరిస్తాడు. అయితే, సెట్‌లో మాత్రం ఒకరంటే ఒకరికి పడదు. ఇద్దరి మధ్య మాటలు కూడా లేకుండానే షూటింగ్ సాగిపోతుంటుంది.
వీరిద్దరి మధ్య సయోధ్య కుదిర్చేందుకు హీరోయిన్ కుమారి (భాగ్యశ్రీ బోర్సే) ప్రయత్నిస్తుంటుంది. మూవీ కంప్లీట్ అవుతుందనుకునే టైంలో టీంలో ఒకరు హత్యకు గురవుతారు. దీంతో ఇద్దరి మధ్య మళ్లీ వివాదం రేగుతుంది. ఆ హత్య కేసు ఇన్వెస్టిగేషన్ చేసేందుకు ఇన్‌స్పెక్టర్ దేవరాజ్ (రానా దగ్గుబాటి) రంగంలోకి దిగుతాడు. అసలు గురుశిష్యుల మధ్య వివాదం ఎందుకు వచ్చింది? ఆ హత్య చేసింది ఎవరు? కాంత మూవీ రిలీజ్ అయ్యిందా? అనేది తెలియాలంటే మూవీ చూడాల్సిందే.
Read hindi news:hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: