ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్, టీ సిరీస్ బ్యానర్లపై పాపులర్ ప్రొడ్యూసర్స్ నవీన్ ఎర్నేని, రవి శంకర్ యలమంచిలి సంయుక్తంగా నిర్మించిన, చిత్రం ఆంధ్రా కింగ్ తాలుకా (‘Andhra King Taluka’ movie). ఈ సినిమాకు మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి ఫేమ్ దర్శకుడు మహేష్ బాబు పీ తెరకెక్కించారు. ఈ చిత్రంలో ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని (Ram), కన్నడ సూపర్ స్టార్ ఉపేంద్ర, యువ హీరోయిన్ భాగ్యశ్రీ భోర్సే, రావు రమేష్, మురళీ శర్మ, రాహుల్ రామకృష్ణ తదితరులు కీలక పాత్రల్లో నటించారు.
Read Also: 12A Railway Colony: ఓటీటీలోకి వచ్చేసిన అల్లరి నరేశ్ కొత్త సినిమా..
నవంబర్ 27న థియేటర్లలో విడుదలై ఈ సినిమాకు పాజిటివ్ టాక్ వచ్చింది. కథ, కథనాలు ఆసక్తికరంగా ఉండడం, రామ్ (Ram) ఎనర్జిటిక్ యాక్టింగ్ అభిమానుకు బాగా నచ్చేశాయి. సాంగ్స్ కూడా చార్ట్ బస్టర్ గా నిలిచాయి.థియేటర్లలో యావరేజ్ గా నిలిచిన ఆంధ్రా కింగ్ తాలుకా ఇప్పుడు డిజిటల్ స్ట్రీమింగ్ కు సిద్ధమైందని సమాచారం.

‘ఆంధ్ర కింగ్ తాలూకా’ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్ (Netflix) దక్కించుకుంది. ఈ చిత్రాన్ని క్రిస్మస్ స్పెషల్ కానుకగా డిసెంబర్ 25, 2025న ఓటీటీ స్ట్రీమింగ్ కు తీసుకురానున్నట్లు తెలుస్తోంది. త్వరలోనే దీనికి సంబంధించి ఓ అధికారిక ప్రకటన వెలువడనుంది.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also: