నందమూరి బాలకృష్ణ నటించిన ‘అఖండ-2’ సినిమాలో సంయుక్త మీనన్, పూర్ణ, హర్సాలి కీలక పాత్రలు పోషించగా, ఆది పినిశెట్టి విలన్‌గా నటించారు. 14 రీల్స్ ప్లస్, పతాక బ్యానర్లపై రామ్ ఆచంట, గోపీ ఆచంట ఈ చిత్రాన్ని నిర్మించారు. థియేటర్లలోకి వచ్చిన ‘అఖండ 2’కు ఆడియెన్స్ నుంచి మిశ్రమ స్పందన లభించింది. ఈ నెల 9 నుంచి నెట్‌ఫ్లిక్స్ (Netflix) లో స్ట్రీమింగ్ కానున్నట్లు సమాచారం.దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన రానుందని టాక్ నడుస్తోంది. పాన్ ఇండియా భాషల్లో ఓటీటీలో రిలీజ్ చేయనున్న నేపథ్యంలో థియేటర్లలో మిస్ అయిన ఆడియెన్స్ ఇప్పుడు డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లో సినిమాను ఎలా ఆదరిస్తారో అనే ఆసక్తి నెలకొంది.
Read also: The Raja Saab: బాబోయ్.. ‘రాజాసాబ్’ టికెట్ ధర వింటే షాక్ అవ్వాల్సిందే!
ట్రేడ్ వర్గాలు అంచనా
విడుదలై 22 రోజులు పూర్తయ్యే సరికి ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా సుమారు రూ.121 కోట్ల గ్రాస్ వసూళ్లు రాబట్టింది. తెలుగు రాష్ట్రాల్లో రూ.95 కోట్లు, ఇతర రాష్ట్రాల్లో సుమారు రూ.7 కోట్లు, ఓవర్సీస్‌లో దాదాపు రూ.5 కోట్లు వసూలు చేసింది. మొత్తంగా చూస్తే దాదాపు రూ.70 కోట్ల షేర్ మాత్రమే వచ్చింది.

ఈ సినిమాకు రిలీజ్‌కు ముందు థియేట్రికల్ బిజినెస్ రూ.103–104 కోట్లుగా ఉండటంతో, బ్రేక్ ఈవెన్ కావాలంటే ఇంకా రూ.30 కోట్లకు పైగా షేర్ అవసరం ఉంది. ప్రస్తుతం రోజువారీ కలెక్షన్లు చాలా తక్కువగా ఉండటంతో థియేట్రికల్ రన్‌లో బ్రేక్ ఈవెన్ సాధించడం కష్టమేనని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఇక ఓటీటీ రిలీజ్ తర్వాత అయినా ‘అఖండ 2’కు కొత్త రీచ్ వస్తుందేమో చూడాలి.
Read hindi news:hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read also: