సినీప్రియులకు యాక్షన్ ఫుల్ మాస్ ఎంటర్‌టైన్‌మెంట్ అంటే వచ్చే పేర్లలో ఒకటి జూనియర్ ఎన్టీఆర్ (Jr. NTR). ‘దేవర’ సినిమా రిలీజ్ సమయంలో కాలర్ ఎగరేసి తన అభిమానుల హృదయాలు గెలుచుకున్న తారక్, “నా అభిమానులు కాలర్ ఎత్తుకునే సినిమాలే చేస్తాను” అని అప్పట్లో ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నాడు. అయితే ‘వార్ 2’ విషయంలో ఆయన ఒక అడుగు ముందుకు వేసి ఒక్క కాలర్ కాదు, ఏకంగా రెండు కాలర్లు ఎత్తేశారు. ఈ స్టైల్ గెస్టర్ ఫ్యాన్స్‌లో మాస్ హంగామాను రేపింది.ప్రి-రిలీజ్ ఈవెంట్‌లో ఎన్టీఆర్ మాట్లాడుతూ, “ప్రతిసారి ఒక్కటే కాలర్ ఎగరేస్తా. కానీ ఈసారి రెండూ ఎత్తాను. ఎవరెన్ని మాట్లాడుకున్నా, బొమ్మ అద్భుతంగా వచ్చింది. పండగ చేసుకోండి” అని చెప్పి అభిమానుల్లో ఉత్సాహాన్ని రెట్టింపు చేశారు. నిజానికి, ‘కూలీ’ సినిమా పక్కనే ‘వార్ 2’ (War 2) రావడం వల్ల బాక్సాఫీస్ పోటీ బీభత్సంగా మారింది. రెండు ప్యాన్ ఇండియా బడ్జెట్ మూవీస్ ఒకేసారి రంగంలోకి రావడంతో ఎవరెవరు గెలుస్తారన్న ఆసక్తి పెరిగింది.ఎన్టీఆర్ మాట్లాడిన మాటలు కూడా.. వార్ 2పై నమ్మకాన్ని రెట్టింపుచేశాయి. మరి వార్ వన్ సైడ్‌గా సాగిన వార్ 2 కథ ఏంటో,రివ్యూ లో తెలుసుకుందాం.

కథ
కలిని సంహరించడానికి కల్కిగా మారిన కబీర్ ( హృతిక్ రోషన్), విక్రమ్ చలపతి (ఎన్టీఆర్)ల కథే ‘వార్ 2’. రా ఏజెంట్ అయిన కబీర్, కలి అనే అజ్ఞానశక్తి చెప్పుచేతల్లో పనిచేస్తూ దేశ ద్రోహానికి పాల్పడుతుంటాడు. ఆ ప్రయత్నంలో దేశం కోసం ప్రాణం పెట్టే మేజర్ సునీల్ లూథ్రా (అశుతోష్ రానా)ని ఓ ఆపరేషన్‌లో భాగంగా చంపేస్తాడు కబీర్. అతన్ని పట్టుకోవడం రా టీంకి మేజర్‌గా వస్తాడు విక్రమ్. ఒకప్పుడు తనకి గాడ్ ఫాదర్‌గా ఉన్న లూథ్రాని కబీర్ ఎందుకు చంపాడు? సోల్జర్‌గా దేశం కోసం ప్రాణంపెట్టే కబీర్, దోశద్రోహిగా ఎందుకు మారాడు? శత్రుదేశాలతో ఎందుకు చేతులు కలిపాడు? తనని పట్టుకోవడానికి వచ్చి మేజర్ విక్రమ్ కోసం, కబీర్ తెలుసుకున్న నిజాలేంటి? అసలు వీళ్లిద్దరిలో ఎవరు సోల్జర్? ఎవరు దేశద్రోహి? అసలు ఆ అజ్ఞానశక్తి కలి ఎవరు? ఫ్లాష్ బ్యాక్‌లో వచ్చే కబూ-రఘలకు కబీర్-విక్రమ్‌లకు లింకేంటి? అన్నదే ‘వార్ 2’ కథలోని ట్విస్ట్‌లు, టర్న్‌లు.
Read hindi news: hindi.vaartha.com
Read also: