విక్రాంత్ (Vikranth), చాందినీ చౌదరి జంటగా నటించిన ఫ్యామిలీ డ్రామా ‘సంతాన ప్రాప్తిరస్తు’ ఓటీటీలో విడుదలకు సిద్ధమైంది. ఓటిటి స్ట్రీమింగ్ కు రెడీ అవుతోంది. ఈ మ్యూజికల్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ మూవీ ఈ నెల 19వ తేదీ నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon Prime Video), జియో హాట్ స్టార్ (Jiohotstar) లో స్ట్రీమింగ్ కు రాబోతోంది. ఈ చిత్రం గత నవంబరులో థియేటర్లలో విడుదలైంది.
Read Also: Mrunal Takhur: అల్లు అర్జున్ – అట్లీ మూవీ లో మృణాల్?
కథ
ఈ సినిమాలో ఆమని, తరుణ్ భాస్కర్, వెన్నెల కిశోర్, మురళీధర్ గౌడ్ వంటి నటులు కీలక పాత్రలు పోషించారు. థియేటర్లలో ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయిన ఈ సినిమా ఇప్పుడు ఓటీటీ ప్రేక్షకులను అలరించేందుకు వస్తోంది.ఈ సినిమా కథ విషయానికి వస్తే.. చైతన్య (విక్రాంత్) సాఫ్ట్‌వేర్ ఉద్యోగి. ఓ ఎగ్జామ్ సెంటర్ లో కల్యాణి (చాందిని చౌదరి) ను చూసి ప్రేమలో పడతాడు. ఇద్దరూ దగ్గరౌతారు. కల్యాణి తండ్రి ఈశ్వరరావు (మురళీధర్ గౌడ్) వీరి ప్రేమని వ్యతిరేకించడంతో ఇద్దరూ పారిపోయి పెళ్లి చేసుకుంటారు.

త్వరగా బిడ్డని కనేస్తే అన్ని సమస్యలు పరిష్కారం అవుతాయని భావిస్తాడు చైతు. కాకపోతే పిల్లల విషయంలో తన ప్రయత్నాలు ఫలించవు. దీంతో ఓ సంతాన సాఫల్య కేంద్రాన్ని ఆశ్రయిస్తాడు. వైద్య పరీక్షలు చేయించుకోగా చైతన్యకి ఓ సమస్య ఉన్నట్లు బయట పడుతుంది. తర్వాత ఏం జరిగింది? తన సమస్య కారణంగా చైతన్య ఎలాంటి పరిస్థితులు ఎదురుకున్నాడు? చివరకు చైతన్య, కల్యాణికి పిల్లలు పుట్టారా లేదా ?అనేది మిగతా కథ.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also: