
కోలీవుడ్ హీరో విజయ్ దళపతి సినిమాలకు ఉండే ఫాలోయింగ్ గురించి తెలిసిందే. ఇన్నాళ్లు హీరోగా అలరించిన విజయ్.. ఇప్పుడు రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. ఆయన నటిస్తూన్న చివరి సినిమా జన నాయగన్. ఈ చిత్రాన్ని తెలుగులో జన నాయకుడు (Jananayagan) పేరుతో రిలీజ్ చేయనున్నారు. ఈ నేపథ్యంలో విజయ్ అభిమానుల అత్యుత్సాహం ఒకింత హద్దులు దాటినట్టుగా కనిపిస్తోంది.
Read also: Kalyani Priyadarshan: రణ్‌వీర్ సింగ్ తో జోడి కట్టనున్న కళ్యాణి?
సినిమా బ్యానర్లను చించివేయడం
‘జన నాయగన్ ’ (Jananayagan)ట్రైలర్ సెలబ్రేషన్స్ జరుగుతున్న సమయంలో, అదే సంక్రాంతికి విడుదల కానున్న శివ కార్తికేయన్ నటించిన పరాశక్తి’ సినిమా బ్యానర్లను చించివేయడం, కొన్ని చోట్ల కిందపడేసి తొక్కడం వంటి ఘటనలు చోటుచేసుకున్నాయి. ఈ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారడంతో, శివ కార్తికేయన్ అభిమానులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సినిమా పోటీ ఉండొచ్చు కానీ ఇలా బ్యానర్లు తొలగించడం దారుణమని విమర్శలు చేస్తున్నారు.
ఎన్ని అడ్డంకులు పెట్టినా సంక్రాంతి బరిలో ‘పరాశక్తి’ నిలబడుతుందని వారు కౌంటర్లు ఇస్తున్నారు. ఈ సంఘటనలతో తమిళ ఇండస్ట్రీలో ఫ్యాన్ వార్స్ మరోసారి హాట్ టాపిక్‌గా మారాయి. విజయ్ చివరి చిత్రం కావడంతో ‘జననాయగన్’ హిట్ కావాలని తాము కోరుకుంటుంటే.. విజయ్ అభిమానులు తమ హీరో చిత్రంపై విషం కక్కడం పద్ధతి కాదని శివ కార్తికేయన్ ఫ్యాన్స్ అంటున్నారు.
Read hindi news:hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read also: