అమెరికాలోని న్యూయార్క్ నగరంలో నిర్వహించిన వార్షిక ఇండియా డే పరేడ్ (India Day Parade) ఈసారి కూడా అంగరంగ వైభవంగా జరిగింది. భారత 79వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని, ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ అసోసియేషన్స్ ఆధ్వర్యంలో జరిగే ఈ పరేడ్ అమెరికాలోని అతిపెద్ద భారతీయ వేడుకగా గుర్తింపు పొందింది. వేలాదిమంది భారతీయులు ఈ కార్యక్రమానికి హాజరై జాతీయ గీతాలు పాడుతూ, దేశభక్తి నినాదాలతో వేడుకను మరింత రసవత్తరంగా మార్చారు.

ప్రత్యేక అతిథులుగా రష్మిక – విజయ్
ఈ సారి పరేడ్‌లో ప్రధాన ఆకర్షణగా నిలిచింది సినీ జంట రష్మిక మందన్న మరియు విజయ్ దేవరకొండ (Vijay Deverakonda). వీరిద్దరూ ప్రత్యేక అతిథులుగా హాజరై, భారతీయ సమాజంతో కలిసి స్వాతంత్య్ర వేడుకలో (occasion of Independence Day) పాల్గొన్నారు. వారి ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో ఇప్పటికే వైరల్ అవుతున్నాయి.
రిలేషన్ పుకార్ల నడుమ జంట హాజరు
ఇటీవలి కాలంలో విజయ్ (Vijay Deverakonda)- రష్మికల మధ్య సన్నిహిత సంబంధాలపై అనేక రూమర్స్ ప్రచారంలోకి వచ్చాయి. అలాంటి వాతావరణంలో వీరిద్దరూ ఒకే వేదికపై కనిపించడం అభిమానుల్లో ఆసక్తిని మరింతగా పెంచింది.
కొత్త సినిమా ప్రాజెక్ట్‌పై ఆసక్తి
‘గీత గోవిందం’, ‘డియర్ కామ్రేడ్’ సినిమాల ద్వారా ఇప్పటికే మంచి క్రేజ్ సొంతం చేసుకున్న ఈ జంట మరోసారి కలిసి నటించబోతున్నట్లు సమాచారం. రాహుల్ సంకృత్యాయన్ దర్శకత్వంలో, మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాణంలో పీరియాడిక్ యాక్షన్ థ్రిల్లర్‌గా రూపుదిద్దుకోనున్న ఈ సినిమా కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
Read hindi news: hindi.vaartha.com
Read also: