
విజయ్ దేవరకొండ (Vijay Deverakonda) కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రానికి టైటిల్‌ను ప్రకటించారు. రాహుల్ సాంకృత్యన్ దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి ‘రణబాలి’ అనే శక్తిమంతమైన టైటిల్‌ను ఖరారు చేశారు.సెప్టెంబర్ 11న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఈ విషయాన్ని తెలియజేస్తూ, మేకర్స్ తాజాగా టైటిల్ గ్లింప్స్ రిలీజ్ చేశారు.
Read Also: Anil Ravipudi: 9 కాదు 99 హిట్లు కొట్టినా ఇలాగే ఉంటా..
విజయ్ ఎంట్రీ వేరేలెవల్
”బ్రిటిష్ వారు అతన్ని అనాగరికుడు అని పిలిచారు. నేను దానికి విభేదించను. అతను మన అనాగరికుడు. వన్ అండ్ ఓన్లీ రణబాలిని పరిచయం చేస్తున్నాం. వారు పూడ్చిపెట్టడానికి ప్రయత్నించిన మన చరిత్రపై వాస్తవాలను వెల్లడిస్తున్నాం” అని విజయ్ దేవరకొండ (Vijay Deverakonda) పేర్కొన్నారు. ఇప్పుడు గ్లింప్స్ లో చివరగా గుర్రంపై స్వారీ చేస్తూ ఓ బ్రిటీష్ అధికారిని లాక్కుంటూ విజయ్ రైలు పట్టాలపై నుంచి విజయ్ ఎంట్రీ ఇచ్చిన తీరు మాత్రం వేరేలెవల్.
మొత్తానికి ఈ సినిమాలో విజయ్ దేవరకొండ నటవిశ్వరూపం చూపించనున్నట్లు తెలుస్తోంది‘రణబాలి’ సినిమాలో హీరోయిన్, విలన్ పాత్రధారులను కూడా చిత్ర బృందం ప్రకటించింది. సౌత్ ఆఫ్రికన్ యాక్టర్ ఆర్నాల్డ్ వోస్లూ, రష్మిక మందన ఈ సినిమాలో నటిస్తున్నారనే విషయాన్ని అధికారికంగా వెల్లడించారు. విజయ్ దేవరకొండకి జోడీగా, జయమ్మ అనే పాత్రలో రష్మిక కనిపించింది.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: