తమిళ స్టార్ విజయ్ తలపతి హీరోగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘జన నాయగన్’ (Jana Nayagan). ఇదే సినిమాను తెలుగులో ‘జన నాయకుడు’ పేరుతో విడుదల చేయనున్నారు. దర్శకుడు హెచ్. వినోద్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రం 2026 జనవరి 9న ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రస్తుతం రాజకీయాల్లో తన ప్రయాణాన్ని కొనసాగిస్తున్న విజయ్ (Vijay) కు ఇదే లాస్ట్ సినిమా కావడంతో, ఈ ప్రాజెక్ట్‌పై అభిమానులు, ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.
Read Also: Tollywood: ఇవాళ తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఎన్నికలు

పార్టీకి అనుకూలంగా నినాదాలు
‘జననాయగన్’ ఆడియో విడుదల కార్యక్రమం మలేసియా రాజధాని కౌలాలంపూర్‌లో ఘనంగా జరిగింది. టీవీకే పార్టీని స్థాపించిన విజయ్‌కి ఇది చివరి చిత్రం కావడంతో అభిమానులు పెద్ద ఎత్తున తరలి వచ్చారు. ఆడియో విడుదల కార్యక్రమంలో భాగంగా విజయ్ (Vijay)వేదిక పైకి రాగానే అతనికి, పార్టీకి అనుకూలంగా నినాదాలు మార్మోగాయి. కొంతమంది ‘టీవీకే.. టీవీకే’ అని నినాదాలు చేయగా ఆయన సున్నితంగా వారించారు. ఈ వేదికపై అలాంటి వ్యాఖ్యలు చేయవద్దని చేతి సంజ్ఞతో పేర్కొన్నారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also: