టాలీవుడ్ స్టార్ యాక్టర్ చిరంజీవి టైటిల్(Venkatesh) రోల్‌లో నటిస్తున్న చిత్రం మన శంకర వర ప్రసాద్ గారు (Mana Shankara Varaprasad Garu). అనిల్ రావిపూడి డైరెక్ట్ చేస్తున్నాడు. ‘పండగకు వస్తున్నారు’ అనే ట్యాగ్‌లైన్‌తో వస్తోన్న ఈ మూవీలో లేడీ సూపర్ స్టార్ నయనతార ఫీ మేల్ లీడ్ రోల్‌లో నటిస్తుండగా.. వెంకటేశ్ కీలక పాత్రలో నటిస్తున్నాడు. ఇవాళ విక్టరీ వెంకటేశ్ పుట్టినరోజు సందర్భంగా ‘మన శంకర వరప్రసాద్ గారు’ చిత్రం నుంచి వెంకటేశ్ లుక్‌ను చిత్రబృందం విడుదల చేసింది.
Read also: పుష్ప-2 రికార్డు ను బద్దలుకొట్టిన ‘ధురంధర్’

వెంకటేశ్ పవర్‌ఫుల్ స్టైలిష్ లుక్
విడుదల చేసిన పోస్టర్‌లో వెంకటేశ్(Venkatesh) చాలా స్టైలిష్‌గా కనిపిస్తున్నారు. హెలికాప్టర్ నుంచి దిగి, గన్‌మన్ల పహారా మధ్య నడిచివస్తున్న ఆయన లుక్ సినిమాపై ఆసక్తిని పెంచుతోంది. ఈ సినిమాలో వెంకీ పాత్ర చాలా పవర్‌ఫుల్‌గా ఉండబోతోందని, అదే సమయంలో ఆయన మార్క్ కామెడీ టైమింగ్‌తో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించడం ఖాయమని ఈ పోస్టర్ హింట్ ఇస్తోంది.షైన్ స్క్రీన్స్, గోల్డ్ బాక్స్ ఎంటర్‌టైన్‌మెంట్ పతాకాలపై సాహు గారపాటి, సుస్మిత కొణిదెల, విష్ణు ప్రసాద్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. భీమ్స్ సిసిరోలియో సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని 2026 సంక్రాంతి కానుకగా విడుదల చేయనున్నట్లు మేకర్స్ ఇప్పటికే అధికారికంగా ప్రకటించారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read also :