Upcoming Movies : ఘాటి (Ghaati) – అనుష్క, విక్రమ్ ప్రభు నటించిన క్రిష్ దర్శకత్వం వహించిన యాక్షన్ క్రైమ్ డ్రామా. (Upcoming Movies) గంజాయి బ్యాక్‌డ్రాప్‌లో రూపొందిన ఈ సినిమా సెప్టెంబర్ 5న విడుదల కానుంది.
లిటిల్ హార్ట్స్ (Little Hearts) – మౌలి, శివానీ నాగారం జంటగా నటించిన యూత్ లవ్ స్టోరీ. సాయి మార్తాండ్ దర్శకత్వంలో ఈటీవీ విన్ ప్రొడక్షన్‌లో రూపొందింది.
మదరాసి (Madharaasi) – శివకార్తికేయన్ హీరోగా, ఏఆర్ మురుగదాస్ దర్శకత్వం వహించిన సైకాలజికల్ యాక్షన్ థ్రిల్లర్. రుక్మిణి వసంత్ హీరోయిన్‌గా నటించింది.
బాఘీ 4 (Baaghi 4) – టైగర్ శ్రాఫ్, హర్నాజ్ సంధు జంటగా నటించిన భారీ యాక్షన్ సినిమా. ఏ.హర్ష దర్శకత్వం వహించగా, సంజయ్ దత్ కీలక పాత్రలో కనిపిస్తారు.
లవ్ యూ రా (Love You Raa) – చిన్ని, గీతికా రతన్ నటించిన న్యూ ఏజ్ లవ్ డ్రామా. ప్రసాద్ ఏలూరి దర్శకత్వం వహించారు.
ది బెంగాల్ ఫైల్స్ (The Bengal Files) – వివేక్ అగ్నిహోత్రి దర్శకత్వంలో మిథున్ చక్రవర్తి, అనుపమ్ ఖేర్, పల్లవి జోషి నటించిన చిత్రం. సమాజంలోని వాస్తవ సంఘటనల ఆధారంగా తీసిన ఈ సినిమా చర్చనీయాంశంగా మారింది.
ఓజీ (OG) – పవన్ కళ్యాణ్ హీరోగా, సుజీత్ దర్శకత్వం వహించిన పాన్ ఇండియా గ్యాంగ్‌స్టర్ డ్రామా. ఇమ్రాన్ హష్మీ విలన్‌గా నటించగా, ప్రియాంక అరుల్ మోహన్ హీరోయిన్‌గా కనిపిస్తుంది. సెప్టెంబర్ 25న విడుదల కాబోతోంది.
Read also :