సినిమాలపై ఆసక్తి ఉన్నాపెద్ద బ్యాగ్రౌండ్ లేకుండా టాప్ హీరోయిన్‌గా ఎదగడం అంత తేలిక కాదు. కానీ తన టాలెంట్, డెడికేషన్‌తో బాలీవుడ్‌లో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న నటి త్రిప్తి డిమ్రీ. చిన్న చిన్న షార్ట్ ఫిల్మ్స్‌తో కెరీర్ స్టార్ట్ చేసిన ఆమె, ఇప్పుడు హాట్ ఫేవరేట్ హీరోయిన్‌గా మారిపోయింది. 2023లో వచ్చిన “యానిమల్” మూవీతో ఆమె క్రేజ్ ఒకింత పెరిగిపోయింది. ముఖ్యంగా రణబీర్ కపూర్‌తో 20 నిమిషాల సీన్ ఆమె కెరీర్‌నే టర్నింగ్ పాయింట్‌గా మార్చింది.ఉత్తరాఖండ్‌లోని ఓ చిన్న గ్రామానికి చెందిన త్రిప్తి డిమ్రీ, తన చదువును ఢిల్లీలో పూర్తిచేసింది. చిన్నప్పటి నుంచి యాక్టింగ్‌పై ఆసక్తితో, ఆమె యూట్యూబ్ షార్ట్ ఫిల్మ్స్‌లో నటించేది. “విప్రా డైలాగ్స్” అనే ఛానెల్‌లో ఆమె పలు ప్రకటనల్లో కూడా కనిపించింది. ఆమె టాలెంట్‌ను గమనించిన కొందరు దర్శకులు చిన్న చిన్న అవకాశాలు ఇచ్చారు. అలా బాలీవుడ్‌లో అడుగుపెట్టింది.
బాలీవుడ్ ఎంట్రీ
త్రిప్తి 2017లో బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. అప్పట్లో సన్నీ డియోల్, బాబీ డియోల్ ప్రధాన పాత్రలో వచ్చిన “పోస్టర్ బాయ్స్” సినిమాతో వెండితెరపై కనిపించింది. అయితే, ఆమెకు పెద్దగా గుర్తింపు రాలేదు. తర్వాత 2018లో వచ్చిన “లైలా మజ్ను” చిత్రంలో లైలా పాత్ర పోషించి ప్రేక్షకులను ఆకట్టుకుంది. కానీ ఈ సినిమా పెద్దగా సక్సెస్ కాలేదు.అయితే, 2020లో వచ్చిన “బుల్బుల్” అనే హారర్ మూవీ ఆమె కెరీర్‌లో టర్నింగ్ పాయింట్‌గా మారింది. ఈ చిత్రంలో ఆమె నటనకు విమర్శకుల ప్రశంసలు లభించాయి. కానీ అసలు బ్రేక్ ఆమెకు 2023లో వచ్చిన “యానిమల్” సినిమాతో వచ్చింది.

సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో వచ్చిన “యానిమల్” సినిమా బాక్సాఫీస్‌ను షేక్ చేసింది. పాన్-ఇండియా లెవల్లో రూ.900 కోట్లకు పైగా కలెక్షన్లు సాధించింది. రణబీర్ కపూర్, రష్మిక మందన్నా, బాబీ డియోల్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రంలో త్రిప్తి డిమ్రీ కూడా కీలక పాత్ర పోషించింది.ఈ సినిమాలో రణబీర్ కపూర్‌తో ఆమె 20 నిమిషాల సీన్ ప్రేక్షకులను షాక్‌కు గురిచేసింది. ఆమె నటన, స్క్రీన్ ప్రెజెన్స్ సినీ ప్రేమికులను కట్టిపడేసింది. అంతే కాదు, ఆమె పేరు ఒక్కసారిగా దేశవ్యాప్తంగా మారుమోగిపోయింది. ఈ సినిమా తర్వాత ఆమెకు క్రేజీ ఆఫర్లు తలుపుతట్టాయి.
ఈరోజు త్రిప్తి డిమ్రీ పుట్టినరోజు.ఈ సందర్భంగా ఆమెకు సోషల్ మీడియా వేదికగా అభిమానులు, సినీ తారలు బర్త్ డే విషెస్ తెలుపుతున్నారు. ఉత్తరాఖండ్‌లోని ఒక చిన్న గ్రామానికి చెందిన తృప్తి ఢిల్లీలో చదువుకుంది. చిన్నప్పటి నుంచి ఆమెకు యాక్టింగ్ అంటే చాలా ఇష్టం. తృప్తి యూట్యూబ్ సృష్టికర్త అని, ‘విప్రా డైలాగ్స్’ ఛానెల్‌లో పలు ప్రకటనలలో నటించింది.