తెలుగువారికి మహానటి అనగానే గుర్తొచ్చే పేరు సావిత్రి. చక్కటి అభినయంతో ఎందరో అభిమానులను సొంతం చేసుకున్న ఆమె నిజ జీవితంలో ఎన్నో ఎత్తుపల్లాలు చూసారు. తెలుగు, తమిళ భాషల్లో 84 చిత్రాల్లో నటించిన ఆమె సింగిల్ టేక్ ఆర్టిస్టుగా పేరు తెచ్చుకున్నారు. నటనతో, మానవత్వంతో ఎందరికో స్పూర్తి నింపింది సావిత్రి.
Read Also: Shiv Raj Kumar: ప్రారంభమైన గుమ్మడి నర్సయ్య బయోపిక్
ప్రేక్షకుల హృదయాల్లో ఆమె స్థానం ఎప్పటికీ చెదరనిది
ఆమె, కేవలం నటిగా మాత్రమే కాకుండా, దర్శకురాలిగా, నిర్మాతగా కూడా చిత్ర పరిశ్రమకు సేవ చేశారు. ఆమె నటన నేటి తరానికి ఒక పాఠ్యపుస్తకం లాంటిది. దుఃఖాన్ని ప్రదర్శించడంలో ఆమె కనుబొమ్మల కదలిక, పెదవుల వణుకు, చూపులలోని ఆర్ద్రత… ఇవన్నీ సహజత్వానికి పరాకాష్టగా నిలిచాయి.

సావిత్రి తనదైన ఒక శైలిని సృష్టించారు. ఒక మహిళా నటికి సినీ పరిశ్రమలో అత్యున్నత ప్రమాణాలను నిర్దేశించిన కీర్తి ఆమెకే దక్కుతుంది. తరాలు మారినా, నటులు వచ్చినా పోయినా, తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో ఆమె స్థానం ఎప్పటికీ చెక్కుచెదరనిది. అందుకే ఆమెను నేటికీ ‘మహానటి’ అని మాత్రమే పిలుస్తారు. ఆమె నటనా వారసత్వం తెలుగు సినిమా ఉన్నంత వరకు వెలుగుతూనే ఉంటుంది.నేడు మహానటి సావిత్రి జయంతి.
Read hindi news:hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: