ఈషా రెబ్బా, సత్య, హర్ష చెముడు, ప్రిన్స్ సిసిల్, హేమ, సత్యం రాజేశ్, కుషిత కల్లపు ప్రధాన పాత్రధారులుగా రూపొందిన రొమాంటిక్ కామెడీ వెబ్ సిరీస్ ‘త్రీ రోజెస్’ (Three Roses 2). ఆహా (AHA) ఓటీటీ వేదికగా విడుదలైన ఈ సిరీస్ తొలి సీజన్ మంచి విజయాన్ని సాధించిందని మేకర్స్ చెబుతున్నారు. ఈ నెల 12 నుంచి ‘త్రీ రోజెస్’ సీజన్ 2 ఆహాలో స్ట్రీమింగ్ అవుతోంది..
డైరెక్టర్ మారుతి షో రన్నర్‌గా వ్యవహరించిన ఈ సిరీస్‌కు (Three Roses 2) కిరణ్ కె.కరవల్ల దర్శకుడు. 4 ఎపిసోడ్స్ తో ఈ రోజు నుంచే స్ట్రీమింగ్ కి వచ్చింది. ఈషా రెబ్బాతో పాటు ఈ సారి రాశి సింగ్ – కుషిత సందడి చేయడం విశేషం. సీజన్ 2 ఏ స్థాయిలో అలరించిందనేది ఇప్పుడు చూద్దాం.
Read Also: Venkatesh: వెంకటేశ్ బర్త్ డే.. స్పెషల్ పోస్టర్ విడుదల
కథ
రీతూ (ఈషా రెబ్బా) మేఘన (రాశీ సింగ్) స్రష్ట (కుషిత) ముంబైలో ఓ హాస్టల్ లో ఉంటారు. రీతూకి ‘సమీర్’ తో బ్రేకప్ జరుగుతుంది. సమీర్ తో బ్రేకప్ జరిగితే తనతో చెప్పమన్న ప్రసాద్ (హర్ష) మాటలు ఆమెకి గుర్తుంటాయి. అయితే ఆ మాటలను కూడా పట్టించుకోకుండా ఆమె కెరియర్ పై దృష్టి పెడుతుంది.
యాడ్ ఏజెన్సీ మొదలు పెట్టాలనే ఉద్దేశంతో అందుకు సంబంధించిన సన్నాహాలు చేస్తూ ఉంటుంది. ‘మేఘన’ తల్లి .. ఆమె మేనమామ ఊర్లో కేటరింగ్ నడుపుతూ ఉంటారు. మేఘనకు వీరభోగ వసంత రాయలు (సత్య)తో విడాకులు జరిగిన విహాయం ఆమె తల్లికి గానీ .. మేనమామాకి గాని తెలియదు. ప్రతి నెలా అతను ఇచ్చే భరణంతో ఆమె జీవితం కొనసాగుతూ ఉంటుంది. ‘స్రష్ట’ విషయానికి వస్తే, చిన్నతనంలోనే తల్లిదండ్రులను కోల్పోయిన అనాథ ఆమె.

ట్రాప్ చేయడానికి ట్రై చేస్తుంటారు
బాధ్యతగా నడుచుకోవాలని చెప్పేవాళ్లు లేక ఆకతాయితనంతో ప్రవర్తిస్తూ ఉంటుంది. ఒంటరిగా ఉంటున్న గురుమూర్తి (ప్రభాస్ శ్రీను)కి లేడీస్ పట్ల వ్యామోహం ఎక్కువ. అందువలన, యాడ్ ఏజెన్సీ కోసం తన ఆఫీసు వాడుకోమంటూ అతను రీతూ ముందుకొస్తాడు. ఇక క్లయింట్ కోసం .. ఫస్టు యాడ్ చేయవలసిన మోడల్ కోసం రీతూ వెయిట్ చేస్తుండగా, ప్రసాద్ .. మనో మళ్లీ ఆమె లైఫ్ లోకి వస్తారు.
మేఘనకి భరణం ఎగ్గొట్టాలనే ఉద్దేశంతో వీరభోగ వసంత రాయలు మాస్టర్ ప్లాన్స్ వేస్తుంటాడు. స్రష్ట అమాయకత్వాన్ని గమనించిన కొందరు, ట్రాప్ చేయడానికి ట్రై చేస్తుంటారు. ఈ ఉచ్చులో నుంచి ఈ ముగ్గురూ బయటపడతారా లేదా? అనేదే కథ.
కథనం
జీవితం అందంగా .. ఆనందంగా సాగిపోవాలంటే ఆర్థికంగా బలంగా ఉండాలి .. అండదండలు ఉండాలి. ముఖ్యంగా అమ్మాయిలు ఒక రక్షణ వలయంలో ఉండాలి. లేదంటే వారి బలహీనతను ఆసరాగా చేసుకుని .. తమకి అనుకూలంగా మార్చుకోవడానికి ప్రయత్నించేవాళ్లు చాలామంది కనిపిస్తారు. అలాంటివారు విసిరే ‘వల’ల నుంచి తప్పించుకుంటూ, తమకి నచ్చినట్టుగా బ్రతడానికి పోరాడే ముగ్గురు యువతుల కథ ఇది.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also: