ఇటీవల రష్మిక మంధన్న ‘థామా’, (Thamma Movie) శ్రద్ధా కపూర్ నటించిన ‘స్త్రీ 2’ వంటి పలు ప్రముఖ చిత్రాలకు సంగీతం అందించిన సంగీత దర్శకుడు సచిన్ సంఘ్వీ పై ఒక యువతి లైంగిక వేధింపుల ఆరోపణలు చేస్తూ ఫిర్యాదు చేయడంతో, పోలీసులు విచారణ అనంతరం సచిన్‌ను అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసు ప్రస్తుతం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.
Karnataka: బస్సు ప్రమాదంపై విచారణ జరపాలంటు డీకే శివకుమార్
సచిన్ సంఘ్వీ (Sachin) తనను లైంగికంగా వేధించాడంటూ ఒక యువతి సంచలన ఆరోపణలు చేసింది. సచిన్ సంఘ్వీ తనకు సంగీత పరిశ్రమలో అవకాశం ఇస్తానని హామీ ఇచ్చాడని, ప్రత్యేక మ్యూజిక్ ఆల్బమ్ విడుదల చేశాడని, తనను పెళ్లి చేసుకుంటానని హామీ ఇచ్చి లైంగికంగా వేధించాడని ఆ యువతి ఆరోపించింది.
బాధితురాలు దాఖలు చేసిన ఫిర్యాదు ప్రకారం, సచిన్ 2024లో ఇన్‌స్టాగ్రామ్ (Instagram) ద్వారా ఆ యువతిని సంప్రదించాడు.కొత్త మ్యూజిక్ ఆల్బమ్‌లో అవకాశం ఇస్తానని సచిన్ చెప్పాడు. అప్పటి నుంచి ఇద్దరికీ పరిచయం ఏర్పడింది. సచిన్ ఒకసారి ఆ యువతిని తన స్టూడియోకి పిలిపించి అక్కడ లైంగికంగా వేధించాడని యువతి చెబుతోంది.

చాలాసార్లు లైంగికంగా వాడుకున్నాడని
సచిన్ తనను పెళ్లి చేసుకుంటానని చెప్పి చాలాసార్లు లైంగికంగా వాడుకున్నాడని, ఆ తర్వాత మోసం చేశాడని ఆ యువతి చెప్పింది.సచిన్‌పై వచ్చిన ఆరోపణల గురించి ఆయన న్యాయవాది మాట్లాడుతూ, ‘ నా క్లయింట్‌పై ఎఫ్‌ఐఆర్‌లోని ఆరోపణలు పూర్తిగా నిరాధారమైనవి. ఈ కేసు విచారణకు అర్హమైనది కాదు.
పోలీసులు నా క్లయింట్‌ను అరెస్టు చేయడం చట్టవిరుద్ధం, అందుకే ఆయనను వెంటనే బెయిల్‌పై విడుదల చేశారు’ అని చెప్పుకొచ్చారు. సచిన్ -జిగర్ సంగీత ద్వయానికి బాలీవుడ్ (Bolywood) లో మంచి గుర్తింపు ఉంది. ఇటీవల కాలంలో వీరు ‘స్త్రీ 2’, ‘బేడియా’, ‘థామ’, జాన్వి ‘పరం సుందరి’ తదిరత సూపర్ హిట్ చిత్రాలకు కలిసి పనిచేశారు.
సూపర్ హిట్ పాటలను అందించారు. సచిన్ మొదట్లో ప్రీతమ్‌కు సహాయకుడిగా పనిచేశారు. తరువాత కొన్ని సినిమాలకు పాటలు కూడా పాడారు. తరువాత, జిగర్‌తో కలిసి సంగీత దర్శకత్వం వహించారు.
Read hindi news : hindi.vaartha.com
Epaper : epapervaartha.com
Read Also: