రష్మిక మందన్న (Rashmika Mandanna) గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇప్పుడు తెలుగు, హిందీలో బ్యాక్ టూ బ్యాక్ హిట్ చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉంటుంది. గత కొంతకాలంగా ఆమె నటించిన చిత్రాలన్నీ బాక్సాఫీస్ వద్ద ఏ స్థాయిలో విజయం సాధించాయో చెప్పక్కర్లేదు. ఇటీవలే ది గర్ల్ ఫ్రెండ్ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న రష్మిక. ఇప్పుడు చేతినిండా సినిమాలతో బిజీగా ఉంది. మరోవైపు రష్మిక ప్రేమ, పెళ్లి గురించి అనేక వార్తలు వినిపిస్తున్నాయి.
Read Also: Akhanda 2: ‘అఖండ 2’ విడుదలపై మద్రాస్ హై కోర్టు స్టే

స్పందించిన రష్మిక
టాలీవుడ్ హీరో విజయ్ దేవరకొండతో నిశ్చితార్థం జరిగినట్లు ప్రచారం జరిగినప్పటికీ ఇప్పటివరకు అధికారిక ప్రకటన రాలేదు. ఇక ఇప్పుడు వీరిద్దరి వివాహం ఫిబ్రవరిలో జరగనున్నట్లు టాక్ నడుస్తుంది. తాజాగా ఈ రూమర్స్ పై రష్మిక (Rashmika Mandanna) స్పందించింది.
‘వివాహాన్ని నేను ధ్రువీకరించను. అలాగని ఖండించను. సమయం వచ్చినప్పుడు మాట్లాడతా. అంతకుమించి ఏమీ చెప్పను’ అని ప్రశాంతంగా సమాధానం ఇచ్చారు.
రష్మిక మందన్న మొదటి సినిమా ఏది?
రష్మిక మందన్న మొదటి సినిమా “కిరిక్ పార్టీ” (2016). ఇది కన్నడలో విడుదలైంది.
Read hindi news:hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com/
Read Also: