ఆదా శర్మ ప్రధాన పాత్రలో నటించిన ‘ది కేరళ స్టోరీ’ చిత్రం దేశవ్యాప్తంగా తీవ్ర చర్చలకు దారి తీసిన సంగతి తెలిసిందే. 2023లో విడుదలైన ఈ సినిమా, హిట్ అయ్యింది..రెండు జాతీయ అవార్డులు ఈ సినిమాను వరించాయి. దర్శకుడు సుదీప్తో సేన్ కు, ఉత్తమ దర్శకుడిగా జాతీయ అవార్డు లభించగా, సినిమాటోగ్రఫీ విభాగంలోనూ ఈ చిత్రానికి ప్రతిష్టాత్మక అవార్డు దక్కింది.
Read Also: Bhagavanthudu: ‘భగవంతుడు’ మూవీ టీజర్ రిలీజ్

ఈ చిత్రం ఫిబ్రవరి 27న థియేటర్లలో విడుదల
ఇప్పుడు ‘ది కేరళ స్టోరీ 2 – గోస్ బియాండ్’ (The Kerala Story 2 – Goes Beyond) పేరుతో సీక్వెల్ రానుంది. పార్ట్ 2కు కామాఖ్య నారాయణ్ సింగ్ దర్శకత్వం వహించారు. ఇందులో ఉల్కా గుప్తా, ఐశ్వర్య ఓజా, అదితి భాటియా కీలక పాత్రల్లో నటించారు. ముగ్గురు హిందూ అమ్మాయిలు ఎలా మోసపోయారనే కోణంలో ఈ సినిమా తెరకెక్కించారు.
ఈ చిత్రం ఫిబ్రవరి 27న థియేటర్లలో విడుదల కానుంది. విపుల్ అమృత్‌లాల్ షా నిర్మించారు. 2023లో వచ్చిన ‘ది కేరళ స్టోరీ’ కేరళలో మహిళలు ఇస్లాంలోకి ఎలా మారారు, లవ్ జిహాద్ ఉచ్చులో ఎలా చిక్కుకున్నారు అనే ఇతివృత్తంతో తెరకెక్కింది.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: