శ్రద్ధా శ్రీనాథ్ (Shraddha Srinath) తెలుగు, తమిళ, కన్నడ సినిమాల్లో తన ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న ఒక ప్రముఖ కథానాయిక. ‘జెర్సీ’ సినిమాలో తన నటనతో తెలుగు ప్రేక్షకులను మంత్రముగ్ధుల్ని చేసింది. ఇప్పుడు, ఆమె కొత్తగా ఒక వెబ్ సిరీస్ ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఇది తమిళంలో రూపొందించిన “ది గేమ్” (The Game You Never Play Alone Web Series) సిరీస్.
Hot Topic:విజయ్-రష్మిక ఎంగేజ్‌మెంట్: అభిమానులకు షాక్
కథ
కావ్య (శ్రద్ధా శ్రీనాథ్) ఒక సంస్థలో గేమ్ డెవలపర్ గా పనిచేస్తూ ఉంటుంది. అదే సంస్థలో పనిచేస్తున్న అనూప్ (సంతోష్ ప్రతాప్)ను ప్రేమించి పెళ్లి చేసుకుంటుంది. కొన్ని కారాణాల వలన కావ్య తన అక్కయ్య కూతురు ‘తార’ బాధ్యతను కూడా తానే తీసుకుంటుంది. కావ్య మంచి తెలివైనది మాత్రమే కాదు .. ధైర్యవంతురాలు కూడా. గేమ్ డెవలపర్ గా ఆమె సాధించిన విజయాలకు ప్రశంసలు దక్కుతాయి.
ఆమెను గురించిన కథనాలు పత్రికలు కూడా ప్రచురిస్తాయి.అలాంటి కావ్యపై కొంతమంది ముసుగు వ్యక్తులు దాడి చేస్తారు.ఆ గాయాల నుంచి ఆమె కోలుకోవడానికి కొన్ని రోజులు పడుతుంది. ఈ లోగా సోషల్ మీడియా (Social media) ద్వారా కూడా ఆమె వ్యక్తిత్వాన్ని దెబ్బతీయడానికి ఆ ముసుగు వ్యక్తులు ప్రయత్నిస్తారు. తన గురించి అందరూ గుసగుసలు మాట్లాడుకోవడం ఆమెకి చాలా బాధను కలిగిస్తుంది.

కథనం
ఈ విషయం ఆమెకి .. అనూప్ (Anoop) కి మధ్య అగాధాన్ని కూడా సృష్టిస్తాయి. ఇద్దరో విడిపోయే పరిస్థితి వస్తుంది.ఇలాంటి పరిస్థితులలోనే గతంలో గౌతమ్ అనే వ్యక్తితో కావ్య సన్నిహితంగా ఉన్న వీడియో ఒకటి వైరల్ అవుతూ ఉంటుంది. అదే సమయంలో కావ్య అక్కయ్య కూతురు ‘తార’, దేవ్ అనే ఒక యువకుడి ట్రాప్ లో పడుతుంది.
ఆ యువకుడు ‘తార’ను బ్లాక్ మెయిల్ చేయడం మొదలుపెడతాడు. తనకి సంబంధించిన సమస్యలలో నుంచి తాను బయటపడటం కోసం, ‘తార’ను కాపాడుకోవడం కోసం కావ్య ఏం చేస్తుంది? ఎలాంటి సవాళ్లను ఎదుర్కోవలసి వస్తుంది? అనేది కథ.
Read hindi news: hindi.vaartha.com
Read Also: