మనోజ్ బాజ్‌పాయ్, ప్రియమణి ప్రధాన పాత్రల్లో
దేశవ్యాప్తంగా ఆడియెన్స్‌ను అలరించిన ‘ది ఫ్యామిలీ మ్యాన్’ వెబ్ సిరీస్ మూడో సీజన్‌తో త్వరలో మన ముందుకు రాబోతోంది. ఈ సీజన్‌ను అమెజాన్ ప్రైమ్(The family man 3) వీడియోలో నవంబర్ 21 నుంచి స్ట్రీమింగ్ చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించారు.
మొదటి రెండు సీజన్లలో మనోజ్ బాజ్‌పాయ్ శ్రీకాంత్(Manoj Bajpai Srikanth) తివారీగా నటనకు ప్రేక్షకుల నుండి విశేష అభినందనలు లభించాయి. మూడో సీజన్‌లో ఆయన ఎలాంటి కొత్త సవాళ్లను ఎదుర్కోబోతున్నారనే ఆసక్తి ప్రేక్షకులలో నెలకొంది.
Read also: బీసీసీఐపై ఐసీసీ మాజీ రిఫరీ సంచలన ఆరోపణలు

కొత్త ప్రాంతం, కొత్త విరోధి
మూడో సీజన్ కథ ఈశాన్య రాష్ట్రాల(The family man 3) నేపథ్యంలో సాగనుంది. ఇందులో ‘పాతాళ్ లోక్’ సిరీస్ ద్వారా గుర్తింపు పొందిన జైదీప్ అహ్లవత్ ప్రతినాయకుడి పాత్రలో కనిపించనుండటం ఫ్యాన్స్ కోసం పెద్ద ఆకర్షణ. తెలుగు, హిందీ, తమిళం, మలయాళం భాషల్లో సిరీస్ ఒకేసారి రిలీజ్ కానుంది. రాజ్ & డీకే ద్వయం ఈ సీజన్‌కు కూడా దర్శకత్వం వహించారు.
Read hindi news: https://hindi.vaartha.com
Epaper : https://epaper.vaartha.com/
Read Also: