‘ఫ్యామిలీ మ్యాన్’ మూడో సీజన్ (The Family Man Season 3) తో మళ్లీ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మనోజ్ బాజ్‌పాయ్, జైదీప్ అహ్లావత్, ప్రియమణి వంటి అగ్ర నటీనటులు నటించారు. రోజువారీ కుటుంబ సమస్యలతో పాటు జాతీయ భద్రతను కాపాడే స్పై జీవితం ఎలా ఉంటుందనేది ఈ సిరీస్ లో చూపించారు, దర్శకులు. ఇంతవరకూ వచ్చిన రెండు సీజన్లకు ఆడియన్స్ వైపు నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. నవంబర్ 21 నుంచి అమెజాన్ ప్రైమ్ లో (Amazon Prime Video) స్ట్రీమింగ్ అవుతోంది.
Read Also: Samantha Raj Wedding: సమంత–రాజ్ వెడ్డింగ్ హైలైట్స్

టాప్-5 ట్రెండింగ్‌లో ‘ది ఫ్యామిలీ మ్యాన్ 3’
ఈ సిరీస్ ఓ అరుదైన రికార్డును సొంతం చేసుకుంది. ఈ ఏడాది అమెజాన్ ప్రైమ్ వీడియో వేదికగా విడుదలైన వెబ్‌సిరీస్‌లలో అత్యధికమంది వీక్షించిన సిరీస్‌గా ‘ది ఫ్యామిలీ మ్యాన్ 3’ నిలిచింది. రాజ్ అండ్ డీకే దర్శకత్వంలో రూపొందిన ఈ సిరీస్ నవంబరు 21న హిందీ, తెలుగుతో పాటు పలు భారతీయ భాషల్లో అందుబాటులోకి వచ్చింది.
అయితే ఈ కొత్త సీజన్ గత రెండు సీజన్ల వ్యూస్‌ను అధిగమించినట్లు చిత్రబృందం ప్రకటించింది. స్ట్రీమింగ్‌కు వచ్చిన తొలివారంలోనే ఈ సిరీస్ ఇండియాలోని 96 శాతం పిన్‌కోడ్స్‌కు చేరువైంది. అంతేకాకుండా, భారత్‌తో పాటు యూకే, కెనడా, ఆస్ట్రేలియా, యూఏఈ, సింగపూర్, మలేషియా వంటి 35 దేశాల్లో టాప్-5 ట్రెండింగ్‌లో నిలిచి అంతర్జాతీయ స్థాయిలోనూ ప్రేక్షకులను ఆకట్టుకుంది. మరోవైపు ఈ నాలుగో సీజన్‌కి త్వరలోనే అప్‌డేట్ ఇవ్వబోతున్నట్లు ప్రైమ్ వీడియో ప్రకటించింది.
Read hindi news:hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com/
Read Also: