మాసాబ్ ట్యాంక్ పోలీస్ స్టేషన్‌లో తనపై నమోదైన డ్రగ్స్ కేసును కొట్టివేయాలని ప్రముఖ సినీ నటి రకుల్ ప్రీత్ సింగ్ సోదరుడు అమన్ ప్రీత్ సింగ్ (Telangana) హైకోర్టును ఆశ్రయించాడు. డ్రగ్స్ ముఠాలతో తనకు ఎలాంటి సంబంధం లేదని.. ఈ కేసులో తనను అన్యాయంగా ఇరికించారని ఆయన తన పిటిషన్‌లో పేర్కొన్నారు.గత నెల 19న హైదరాబాద్‌లోని బంజారాహిల్స్ సమీపంలో పోలీసులు నిర్వహించిన ఆకస్మిక దాడుల్లో భారీగా మాదకద్రవ్యాలు పట్టుబడ్డాయి.
Read also: AP Bus Accident: ట్రావెల్స్ బస్సులో మంటలు

ఈ నెల 9వ తేదీకి వాయిదా
పోలీసుల దర్యాప్తులో నిందితుల సెల్‌ఫోన్లను విశ్లేషించగా.. అమన్ ప్రీత్ సింగ్ పేరు ప్రముఖంగా వినిపించింది. అమన్ కేవలం డ్రగ్స్ వినియోగదారుడు మాత్రమే కాదని అంతర్రాష్ట్ర డ్రగ్స్ ముఠాలతో ఆయనకు సంబంధాలు ఉన్నాయని పోలీసులు అనుమానిస్తున్నారు. గత నెల రోజుల్లోనే ఆయన సుమారు ఆరుసార్లు నిందితుల వద్ద నుండి డ్రగ్స్ కొనుగోలు చేసినట్లు డిజిటల్ ఆధారాల ద్వారా నిర్ధారణకు వచ్చారు. దీంతో ఈ కేసులో అమన్‌ను ఏ7గా చేర్చి, ఆయన కోసం పోలీసులు గాలింపు చర్యలు ముమ్మరం చేశారు.
ఈ కేసులో తదుపరి దర్యాప్తు చేపట్టకుండా మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలని కోర్టులో పిటిషన్ దాఖలు చేశాడు. పోలీసుల గాలింపు నేపథ్యంలో అమన్ ప్రీత్ సింగ్ ముందస్తు జాగ్రత్తగా హైకోర్టును ఆశ్రయించారు. తనపై నమోదైన కేసులో ఆధారాలు లేవని, చట్టబద్ధంగా ఆ ఎఫ్ఐఆర్‌ను క్వాష్ చేయాలని కోరారు. అయితే ప్రాథమిక ఆధారాలు బలంగా ఉన్నాయని పోలీసులు భావిస్తున్నారు. ఈ పిటిషన్‌పై నిన్న హైకోర్టులో విచారణ జరిగింది. దీనిపై తదుపరి విచారణను హైకోర్టు ఈ నెల 9వ తేదీకి వాయిదా వేసింది.
Read hindi news:hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read also: