నటి శిరీషతో వివాహ బంధంలోకి టాలీవుడ్ హీరో నారా రోహిత్
టాలీవుడ్ నటుడు నారా రోహిత్(Nara Rohit) జీవితంలో కొత్త అధ్యాయం ప్రారంభం కానుంది. ఆయన నటి శిరీష లేళ్లతో అక్టోబర్ 30న వివాహ బంధంలోకి అడుగుపెడుతున్నారు. ఈ వేడుక హైదరాబాద్‌లో అంగరంగ వైభవంగా నాలుగు రోజుల పాటు జరగనుంది. పెళ్లి ఏర్పాట్లతో బిజీగా ఉన్న రోహిత్ ఇటీవల తెలంగాణ(Telangana cm) ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసి వివాహానికి ఆహ్వానించారు. ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
నారా కుటుంబం పెళ్లి వేడుకలను సంప్రదాయబద్ధంగా ఘనంగా నిర్వహించేందుకు సిద్ధమవుతోంది. అక్టోబర్ 25న హల్దీ, 26న వధూవరుల కార్యక్రమం, 28న మెహందీ వేడుకలు జరుగుతాయి. అక్టోబర్ 30న రాత్రి 10:35 గంటలకు శుభముహూర్తంలో నారా రోహిత్, శిరీషల వివాహం జరగనుంది. ఈ వేడుకకు సినీ, రాజకీయ రంగాల ప్రముఖులు హాజరు కానున్నారు.
Read also: ఎట్టకేలకు రేవంత్ రెడ్డికి క్షమాపణన చెప్పిన కొండా సురేఖ !

సినిమా సెట్స్‌లో మొదలైన ప్రేమ కథ
‘ప్రతినిధి–2’ సినిమా షూటింగ్ సమయంలో రోహిత్, శిరీష మధ్య స్నేహం చిగురించి ప్రేమగా మారింది. ఇరువురి కుటుంబాల అంగీకారంతో గత ఏడాది అక్టోబర్ 13న హైదరాబాద్‌లోని నోవాటెల్ హోటల్‌లో నిశ్చితార్థం జరిగింది. ఆ వేడుకకు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, భువనేశ్వరి దంపతులు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు.
అయితే, కొద్ది కాలానికే రోహిత్ తండ్రి రామ్మూర్తి నాయుడు మరణించడంతో పెళ్లి వాయిదా పడింది. ఇప్పుడు మళ్లీ పెళ్లి తేదీ ఖరారవడంతో నారా కుటుంబంలో ఆనంద వాతావరణం నెలకొంది. ప్రస్తుతం రోహిత్ రాజకీయ, సినీ ప్రముఖులను (Telangana cm) కలుసుకుంటూ వివాహానికి ఆహ్వానిస్తున్నారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also: