సినిమా ప్రపంచం అనగానే మనకు గుర్తుకొచ్చేది గ్లామర్. హీరోయిన్లకు అవకాశాలు రావాలంటే అందాలు, స్టైల్, హాట్ లుక్స్ ప్రదర్శించాల్సిందే అన్న మాట ఎప్పటి నుంచో వినిపిస్తోంది. కానీ అందాల ప్రదర్శనతో పాటు మంచి నటన, అదృష్టం కూడా కలిసొస్తేనే వారు స్టార్ హీరోయిన్లుగా ఎదుగుతారు. కేవలం గ్లామర్ మీద ఆధారపడితే ఒకట్రెండు సినిమాలకే పరిమితమవ్వాల్సి వస్తుంది. అలాంటి ఉదాహరణలతో పాటు గ్లామర్ లేకుండా కూడా స్టార్ హీరోయిన్లుగా ఎదిగిన సావిత్రి, సౌందర్య లాంటి నటి మణులు ఉన్నారు. నేటితరం ప్రేక్షకులను తన నటనతో కట్టిపడేసిన కీర్తి సురేష్ (Keerthy Suresh) కూడా తొలినాళ్లలో చాలా పద్దతిగా కనిపించింది. కానీ ఇప్పుడు పోటీని ఎదుర్కొని అవకాశాలు దక్కించుకోవాలంటే గ్లామర్ కూడా అవసరమని అర్థం చేసుకుంది.
తొలి సినిమాల్లో పద్దతిగా కనిపించిన ఆమె
ఈ నేపథ్యంలో మిల్కీ బ్యూటీగా పేరు తెచ్చుకున్న తమన్నా భాటియా (Tamannaah Bhatia) ను ప్రత్యేకంగా ప్రస్తావించుకోవాలి. అమాయకమైన ముఖకవళికలు, పాలలాంటి శరీర కాంతి, లేలేత అందాలతో తన కెరీర్ ప్రారంభంలో చాలా క్యూట్‌గా కనిపించిన తమన్నా, 20 ఏళ్లకు పైగా ఇండస్ట్రీలో కొనసాగుతోంది. తొలి సినిమాల్లో పద్దతిగా కనిపించిన ఆమె, కొంతకాలం తర్వాత అవకాశాలు తగ్గిపోవడంతో రూట్ మార్చుకోవాల్సి వచ్చింది. ఆ సమయంలోనే ఆమె గ్లామర్ వైపు అడుగులు వేసింది. ఆ మార్పే ఆమె కెరీర్‌కు కొత్త ఊపిరి నిచ్చింది.
ఆమె నార్త్ నుంచి సౌత్ వరకు తన ఫ్యాన్ బేస్
సౌత్ ఇండస్ట్రీలోనే కాకుండా బాలీవుడ్‌లో కూడా తమన్నా తన గ్లామర్‌తో గుర్తింపు తెచ్చుకుంది. ఐటెం సాంగ్స్‌లో తన హాట్ డ్యాన్స్ మూవ్స్‌తో ప్రేక్షకులను ఉర్రూతలూగించింది. ‘జైలర్’, వంటి సినిమాల్లో ఐటెం సాంగ్స్ చేసిన ఆమె నార్త్ నుంచి సౌత్ వరకు తన ఫ్యాన్ బేస్‌ను మరింత పెంచుకుంది. ఘాటు రొమాన్స్ సీన్స్, లిప్‌లాక్‌లతో వెండితెరకు వేడి పుట్టించింది. ఇక సోషల్ మీడియాలో అయితే తమన్నా హాట్ హాట్ ఫోటోషూట్స్ రెగ్యులర్‌గా వైరల్ అవుతుంటాయి. ఆమె నడుము అందాలకే ప్రత్యేకమైన అభిమాన గణం ఉందనడం అతిశయోక్తి కాదు.

తొలినాళ్లలో నేను చాలా సింపుల్
ఇటీవల ఓ ఇంటర్వ్యూలో తమన్నా తనలో వచ్చిన ఈ మార్పు గురించి మాట్లాడింది. “సినిమా అనేది ఎప్పటికప్పుడు మారే రంగం. ఇక్కడ నిలదొక్కుకోవాలంటే కొత్త కొత్తగా ట్రై చేయాల్సిందే. తొలినాళ్లలో నేను చాలా సింపుల్‌గా, పద్దతిగా కనిపించేదాన్ని. కానీ ఆ ఇమేజ్‌తోనే ఎక్కువకాలం కొనసాగలేమని అర్థమైంది. ప్రేక్షకులు ఎప్పుడూ కొత్తదనం కోరుకుంటారు. అందుకే నేను గ్లామర్ వైపు మలుపు తిరిగాను. నటనతో పాటు గ్లామర్ కూడా సమపాళ్లలో చూపించాలి అని నమ్ముతాను” అని చెప్పింది.కెరీర్ మొదట్లో నాకు నేనే కొన్ని కండిషన్లు పెట్టుకోవడంతో మంచి పాత్రలు మిస్ అయ్యాను. చాన్నాళ్లు నో కిస్ పాలసీని కఠినంగా పాటించాను.
నేను ఎప్పటి నుంచో కసరత్తులు చేస్తున్నా
అయితే హీరోయిన్‌గా అవకాశాలు ఎప్పుడైతే తగ్గాయో ఆ పాలసీకి గుడ్ బై చెప్పేసి గ్లామర్ రోల్స్ చేయడం ప్రారంభించా. అదే నా కెరీర్‌కి టర్నింగ్ పాయింట్. నన్ను నేను మార్చుకోకపోతే సినీ ఇండస్ట్రీ నుంచి ఎప్పుడో వెళ్లిపోయేదాన్ని. మార్పుని ఆహ్వానిస్తే ఎక్కడైనా నెగ్గుకురాగలం’ అని చెప్పుకొచ్చింది తమన్నా. ‘నేను ఎప్పటి నుంచో కసరత్తులు చేస్తున్నా. శరీరం ఏది చెబుతుందో అదే నేను చేస్తా. అలసటగా ఉన్నా, నిద్ర సరిగ్గా లేకపోయినా వర్కౌట్లు మానేసి రెస్ట్ తీసుకుంటా. ఏదీ బలవంతంగా చేయను. ప్రశాంతమైన ప్రదేశాలు సందర్శించడం, దేవాలయాలకు వెళ్లడం ఇష్టం. ఇటీవలే కాశీకి వెళ్లొచ్చా. ఆ నగరంలోని ఆధ్యాత్మిక వాతావరణం నా మనసుని ఎంతగానో ఆకట్టుకుంది’ అని తన వ్యక్తిగత విషయాల్ని కూడా షేర్ చేసుకుంది.
Read hindi news: hindi.vaartha.com
Read also: